BigTV English

Lava Blaze 5G at Rs 649: రూ.8,999 ధరగల Lava 5జీ ఫోన్‌ కేవలం రూ. 649కే.. ఎలాగంటే..?

Lava Blaze 5G at Rs 649: రూ.8,999 ధరగల Lava 5జీ ఫోన్‌ కేవలం రూ. 649కే.. ఎలాగంటే..?

Buy Lava Blaze 5G at Rs 649: ఇప్పుడంతా 5జీ మయమైపోయింది. మార్కెట్‌లోకి కొత్త కొత్త 5జీ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఫోన్ ప్రియులు కూడా 4జీ నుంచి 5జీకి కన్వర్ట్ అయిపోతున్నారు. అందువల్లనే 5జీ మొబైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల సామన్యులకు భారంగా మారుతుంది. తక్కువ ధరలో 5జీ మొబైల్‌ని కొనుక్కుందాం అనుకున్నా.. అధిక ధర కారణంగా వారి ప్లాన్‌ను మార్చుకుంటున్నారు.


అయితే ఇక ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే అదిరిపోయే ఆఫర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌తో అత్యంత తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో లావా బ్లెజ్ 5జీ (Lava Blaze 5G) ఫోన్‌పై సూపర్ డూపర్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని బేస్ వేరియంట్ 4/128 జీబీ అసలు ధర రూ.14,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో రూ.8,999లకే లిస్ట్ అయింది. అలాగే మిడ్ వేరియంట్ 6/128 జీవీ ధర రూ.16,349 ఉండగా.. ఇప్పుడు రూ.9,299లకే లిస్ట్ అయింది. అలాగే దీని టాప్ వేరియంట్ 8/128 జీబీ ధర రూ.16,499 ఉండగా.. ఇప్పుడు రూ.9,999లకే కొనుక్కోవచ్చు. తక్కువ ధరలో మంచి 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదొక చక్కటి అవకాశమనే చెప్పాలి.


Also Read: కిర్రాక్ ఆఫర్.. సెకండ్ హ్యాండ్ ఫోన్ ధరకే కొత్త 5జీ ఫోన్..!

ఇక ఈ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. జె అండ్ కె బ్యాంక్ క్రెడిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు, అలాగే డెబిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా వన్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై కూడా తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.

ఇవి కాకుండా వీటిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 4/128జీబీ వేరియంట్‌పై రూ.8,350 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ వేరియంట్‌ను రూ.649లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే 6/128జీబీ వేరియంట్‌పై రూ.8,800 వరకు తగ్గింపు, 8/128జీబీ వేరియంట్‌పై రూ.9,100 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

అయితే ఈ మొత్తం ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అలాగే పిన్ కోడ్ బట్టి కూడా ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ మారే అవకాశం ఉంది. అందువల్ల కొనేముందు ఒకసారి చెక్ చేసుకోవాలసి ఉంటుంది.

Related News

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Big Stories

×