Kannada Producer Soundarya Jagadish Passed Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ నిన్న (ఏప్రిల్ 14)న తుదిశ్వాస విడిచారు. బెంగుళూరులోని తన నివాశంలో శవమై అతడు కనిపించాడు. అయితే వెంటనే ఆయనను రాజాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు.
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో సౌందర్య జగదీష్ మృతిని పోలీసులు అసహజ మరణంగా భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం.. పోలీసులు ఆత్మహత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఆయన మృతిపై కన్నడ నటుడు దర్శన్ సంతాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సౌందర్య జగదీష్ కుటుంబాన్ని అతడు పరామర్శించాడు. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాత, దర్శకుడు తరుణ్ సుధీర్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించాడు.
Also Read: ‘కంగువ’ నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. స్టోరీ ఎలా ఉండబోతుందో తెలిసిపోయింది..?
సౌందర్య జగదీష్ ఆకస్మిక మృతి పట్ల చాలా దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నాడు. ఆయన మృతి కన్నడ సినీ పరిశ్రమలో ఎంతో లోటును కలిగిస్తుందని తెలిపాడు. ఈ మేరకు ఆయను కుటుంబ సభ్యులకు ప్రియమైనవారికి తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు రాసుకొచ్చాడు.
జగదీష్ సినిమాల విషయానికొస్తే.. అప్పు పప్పు, స్నేహితారు, రామ్లీల, మస్త్ మజా మాది సహా అనేక చిత్రాలను నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన మరణ వార్త కుటుంబ సభ్యలతో పాటు స్నేహితులు, సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.