OTT Movie : ప్రస్తుతం ఓటీటీలలో లెక్కలేనన్ని సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే అందులో బెస్ట్ సినిమాలను వెతుక్కోవడం అంటే చాలా కష్టమైన పని. అలా అదిరిపోయే మర్డర్ మిస్టరీ గురించి వెతుకుతున్న వారికోసమే ఈ మూవీ సజెషన్. ఇదొక కన్నడ క్రైమ్ థ్రిల్లర్. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటిటిలో ఉంది? కథ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
ఈ మూవీ స్టోరీ అంతా కర్ణాటక తమిళనాడు బార్డర్లోని దేవగిరి అనే ఒక మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామం ఎంత మారుమూలన ఉంటుందంటే కనీసం ఆ ఊరు నుంచి సిటీకి వెళ్లడానికి రోడ్డు కూడా ఉండదు. అంతేకాదు కరెంట్ అస్సలు ఉండదు. సూర్యాస్తమయం అయ్యిందంటే ఈ గ్రామం పూర్తిగా చీకట్లో మునిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఊరికి దగ్గరలో ఉన్న ఒక మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న మర్రిచెట్టు పై దయ్యాలు తిరుగుతాయని చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్టోరీలు విని స్థానికులు భయపడుతుంటారు. గ్రామస్తులు పూర్తిగా మూఢనమ్మకాల్లో కూరుకుపోయి, దాని గురించి ఆలోచించడానికి కూడా భయపడతారు. ఇక మూవీ స్టోరీ ఓ దొంగతనంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇద్దరు దొంగలు దోపిడీ చేసిన సొమ్ముతో సైకిల్ పై పారిపోతుంటారు. కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ ఇద్దరిలో ఓ దొంగ ఊహించిన విధంగా చనిపోతాడు. అప్పటికే అక్కడ దెయ్యాలు ఉన్నాయని గట్టిగా నమ్మేగ్రామస్తుల్లో ఆ దొంగ చనిపోవడం మరింత భయాన్ని నింపుతుంది.
ఇక అదే టైములో విష్ణు తన టీం తో అక్కడ దిగుతాడు. ఈ అబ్బాయి దెయ్యాల వేటకు సంబంధించిన వీడియోలతో అప్పటికే బాగా పాపులర్. ఇక ఈ ఊర్లో కథలుగా చెప్పుకుంటున్న ఆ దయ్యాలను కెమెరాలో బంధించాలని నిర్ణయం తీసుకుని ఊర్లో అడుగుపెడతారు. అదిరిపోయే అడ్వెంచర్ కోసం దేవగిరి గ్రామానికి వెళ్ళగా ఆ హాంటెడ్ మెయిన్ రోడ్ గురించి వీడియో తీయాలని ప్లాన్ చేస్తారు. విష్ణు టీంలో ఒకరు ఈ గ్రామానికి చేరుకునే ముందే సడన్ గా చనిపోతాడు. ఇక నెమ్మదిగా విష్ణు టీం గ్రామస్థులలో గూడు కట్టుకున్న భయాన్ని మూఢనమ్మకాలను వదల కొట్టే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా రోడ్డు వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీస్తారు. ఆ నిజం ఏంటి? అసలు ఆ రోడ్డుపై మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి? దానికి గల కారణం ఎవరు? రోలర్ కోస్టర్ లా ఉండే త్రిల్లింగ్ క్లైమాక్స్ ఏంటి? అనే విషయాలను ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఏ ఓటిటిలో ఉందంటే?
ఈ మూవీ పేరు కప్పు బిలుపిన నడువే (kappu bilupina naduve). 24 లో రిలీజ్ అయిన ఈ కన్నడ క్రైమ్ ట్రైలర్ సినిమాకు వసంత్ విష్ణు దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటన స్పూర్తితో తెరకెక్కిన ఈ మూవీలో వసంత్ విష్ణు, విద్యా శ్రీ గౌడ, శరత్ లోహితాశ్వ, హరీష్, నవీన్ రఘునాథ్ మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : మృత్యు దేవతతో అమ్మాయి పోరాటం… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని మలుపులు