E-Paper
Advertisement

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వం సహకరించకున్నా సరే, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తాం : కిషన్‌రెడ్డి

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వం సహకరించకున్నా సరే, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తాం : కిషన్‌రెడ్డి
Advertisement

Central Minister Kishan Reddy :  ఎంఎంటీఎస్ సర్వీసుల పొడిగింపుపై కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ (MMTS) సేవలను పొడిగిస్తామని వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి దాదాపుగాలో 90 శాతం మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి అయ్యిందని వివరించారు.

రూ.650 కోట్లతో రైల్ తయారీ ఫ్యాక్టరీ…

Advertisement

అంతకుముందు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌తో తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం రైల్‌ నిలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామన్న కేంద్రమంత్రి, వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నామన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‌ను పెంచామని చెప్పుకొచ్చారు.

మరిన్ని వందేభారత్ రైళ్లు వస్తున్నాయ్…

Advertisement

మరోవైపు జోన్ పరిధిలో ఇఫ్పటికే 5 వందే భారత్‌ రైళ్లు నిత్యం ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో త్వరలోనే మరికొన్నింటినీ ప్రవేశపెడతామన్నారు.

సికింద్రాబాద్ ముస్తాబు…

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పనులు సైతం జోరుగా సాగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. రూ.720 కోట్లతో పనులు పరుగులు పెడుతున్నాయన్నారు.

ఘట్‌కేసర్‌ నుంచి పొడిగింపు…

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కేవలం ఘట్‌కేసర్‌ వరకే  ఎంఎంటీఎస్‌ సర్వీసులు రోజూవారీగా నడుస్తున్నాయన్నారు. ఈ సర్వీసులను యాదాద్రి వరకు విస్తరించాల్సి అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు రూ.650 కోట్లు మేర నిధులు అవసరమవుతాయన్నారు. అయితే తెలంగాణ సర్కార్ సహకరించకున్నా కేంద్రం నిధులతోనే ఎంఎంటీఎస్‌ సర్వీసును పొడిగిస్తున్నట్లు స్ఫష్టం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు, సురేష్‌రెడ్డి, కావ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు తమ ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాసులు…

ఈదుల నాగులపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలన, కొల్లూరు, ఈదుల నాగులపల్లి రైల్వే బ్రిడ్జిని సైతం అభివృద్ధి చేయాలని ఎంపీ రఘునందన్‌ రావు కోరారు. ఇక జర్నలిస్టులు, దివ్యాంగులకు రైల్వే పాస్‌లను పునరుద్ధరించాలని, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ కూడా పూర్తి చేయాలని అభ్యర్థించారు.

also read : టపాసులు అమ్ముతున్నారా, అయితే మీ దుకాణాలకు ఇవి తప్పనిసరి, లేకుంటే అంతే సంగతులు : జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×