Modi Vishaka Tour : విశాఖలో ప్రధాని మోదీ బహిరంగసభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ భారీ సభ జరుగుతోంది. సుమారు రూ.10వేల 742 కోట్ల ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ.
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీతోపాటు, గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీకి శాలువా కప్పి రాముడి చిత్రాన్ని బహూకరించారు సీఎం జగన్. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మొదట ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగం మొదలు పెట్టారు కేంద్ర మంత్రి.
కేంద్ర మంత్రి తరువాత ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఏం పిల్లడో వెళ్దం వస్తవా అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు ఈ సభకు తరలివచ్చారన్నారు సీఎం జగన్. కేంద్రం, మోదీ, బీజేపీతో మాకున్న అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతం అన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వారు వేరే ఉద్దేశ్యం లేదన్నారు. 8ఏళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రం ఇంకా కోలుకోలేదర్నారు. రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ విజ్ఞప్తులను పరిశీలించాలన్నారు జగన్.
ప్రధాని మోదీ శంకుష్థాపన చేసిన ప్రాజెక్టు వివరాలు ఇవే..
► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు
► రూ. 3,778 కోట్లతో రాయిపూర్- విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే
► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం
► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు
► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన
► రూ. 211 కోట్లతో నిర్మించిన నరసన్నపేట -పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం
► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం