E-Paper
Advertisement

ముద్దమందారం పేరుతో బిజినెస్ మొదలుపెట్టిన హరిత జాకీ.. నెలవారీ ఆదాయం ఏంటంటే?

ముద్దమందారం పేరుతో బిజినెస్ మొదలుపెట్టిన హరిత జాకీ.. నెలవారీ ఆదాయం ఏంటంటే?
Advertisement

Haritha Jockey:బుల్లితెర రంగంలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటి హరిత జాకీ (Haritha Jockey). విభిన్నమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తెలుగు డైలీ సీరియల్ ముద్దమందారంలో అఖిలాండేశ్వరి పాత్ర పోషించి, తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ తో పాటు కళ్యాణం కమనీయం సీరియల్ కూడా ఈమెకు మంచి పేరు అందించింది.తనకు మంచి పేరు అందించిన ‘ముద్దమందారం’ సీరియల్ పేరు మీదే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ‘ముద్దమందారం వస్త్ర నిలయం’ పేరుతో చీరల వ్యాపారం మొదలుపెట్టినట్లు ఇటీవల అభిమానులతో అధికారికంగా తెలియజేసింది. అంతేకాదు పలువురు సెలబ్రిటీలు, ఈ సీరియల్ లో నటించిన సెలబ్రిటీలు హరిత కొత్త బిజినెస్ ప్రారంభోత్సవానికి హాజరయ్యి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కొత్త బిజినెస్, సీరియల్స్ ద్వారా హరిత సంపాదన ఎంతంటే?

ఇకపోతే ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే.. మరొకవైపు యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టిన ఈమె.. అందులో తన పర్సనల్ విషయాలను, కుటుంబ వేడుకలకు సంబంధించిన వీడియోలను, అలాగే కుకింగ్ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే హరిత.. తన కూతురు సమకృతితో కలిసి చేసే రీల్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఇలా సినిమాలు, సీరియల్స్, యూట్యూబ్ ఛానల్ తో పాటు కొత్తగా బిజినెస్ కూడా పెట్టి మరింత దూసుకుపోతున్న ఈమె.. నెలవారీ ఆదాయం ఎంత ఉండొచ్చు.. అంటూ అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు.

వారానికి రూ.6లక్షల పై మాటే..

Advertisement

ప్రస్తుతం రోజూ వారీగా ఒక్కో సీరియల్ కి సుమారుగా రూ.50వేల నుండి రూ.60 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన పాత్రకు ఉన్న డిమాండ్ ను బట్టి వారానికి రూ.4 లక్షల నుండి సుమారుగా రూ.6 లక్షల వరకు సీరియల్స్ ద్వారానే ఈమె సంపాదిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి యూట్యూబ్, ఇప్పుడు కొత్త బిజినెస్ కూడా మొదలు పెట్టడంతో సుమారుగా నెలకు రూ.12 లక్షల నుండి రూ.20 లక్షలకు పైగా సంపాదన ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ హరిత జాకీ ఆదాయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

also read:మహిళలకు సపోర్టుగా నిలబడితే ఉద్యోగాలుండవ్ -రాధిక ఆప్టే

హరిత కెరియర్..

Advertisement

హరిత విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు హరిత తోట. సౌత్ ఇండియన్ సీరియల్స్ లో నటిస్తూ.. సినిమాల ద్వారా కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈమె భర్త ప్రముఖ నటుడు జాకీ తో కలసి పలు సీరియల్స్ లో కూడా నటించిన ఈమె ఇటీవల హైదరాబాద్ లోని నార్సింగి ప్రాంతంలో మొత్తం ‘ముద్దమందారం వస్త్ర నిలయం’ అనే పేరుతో కొత్త వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. ముద్దమందారం సీరియల్ తో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె కుంకుమపువ్వు, కళ్యాణం కమనీయం, సావిత్రమ్మ గారి అబ్బాయి , జానకీ పరిణయం వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది.

హరిత నటించిన సినిమాలు..

హరిత సీరియల్స్ లోనే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రక్త చరిత్ర, మహానటి, సూరారై పొట్రు, అంతరిక్షం 9000 kmph వంటి తెలుగు, తమిళ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఇకపోతే ఈమె సోదరీ ఎవరో కాదు ప్రముఖ సీనియర్ హీరోయిన్ రవళి. తెలుగు, తమిళ్,కన్నడ,మలయాళం, హిందీ భాషా చిత్రాలలో నటించి బహుభాషా నటిగా ఆమె పేరు సొంతం చేసుకున్నారు.

Related News

బిగ్ బాస్ హౌస్ లో సడన్ ఎలిమినేషన్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి గురూ!

Intinti Ramayanam Shriya : పాప చాలా హాటు గురు..ఇది అస్సలు ఊహించలేదు భయ్యా..

శోభశెట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Intinti Ramayanam Today Episode: లాయర్ తో పల్లవి అబద్దం చెప్పిందా..? శ్రీకర్ ప్లాన్ ఫెయిల్.. కమల్ లవ్ ట్రాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 31st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌, మిస్సమ్మల ట్రాప్‌లో పడిపోయిన అమర్‌         

Podarillu Today Episode : కన్నాకు కేశవ గిఫ్ట్.. అడ్డంగా దొరికిన మాధవ్.. పాపం నారాయణ..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వల్లి.. చందు ప్రియురాలు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్.

Big Stories

Advertisement
×