Big Stories

Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త కోణం.. ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్!

Phone Tapping Case

- Advertisement -

Update on Phone Tapping Case: రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్ వేర్ కంపెనీల యజమానుల ఫోన్లును ప్రణీత్ ట్యాప్ చేసి.. వారిని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ డివైజ్ లను ఇతర దేశాలను నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు గుర్తించారు. వారిని బెదిరించడానికి ప్రణీత్ ప్రత్యేక బృందాలను నియమించినట్లు వెల్లడైంది.

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ తరుణంలో ఫోన్ ట్యాపింగ్ డివైజ్ లు కొనుగోలు విషయంలో ఎస్ఐబీ టెక్నికల్​ కన్సల్టెంట్‌ రవిపాల్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. దీంతో రవిపాల్ ను కూడా దర్యాప్తు బృందం విచారించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ డివైజ్ లను దిగుమతి చేసినట్లు వెల్లడైంది. దీనికి గాను ఎస్ఐబీ రవిపాల్ కు కోట్లులో డబ్బులు చెల్లించినట్లు తెలిసింది.

వీటి కొనుగోలు కోసం వీరు భారీ మొత్తంలో నగదు ఖర్చు చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి తెప్పించిన డివైజ్ లను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి దగ్గర్లో వారు ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ పెట్టినట్లు గుర్తించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు, మిత్రుల ఫోన్లను ట్యాప్ చేసి.. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులతో పాటుగా బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలకు చేరవేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారు.

Also Read: KTR Goa Politics: మహబూబ్‌నగర్ బైపోల్.. కేటీఆర్ గోవా పాలిటిక్స్..

రవిపాల్ తెప్పించిన ఈ డివైజ్ లు 300 మీటర్ల పరిధిలో ఫోన్ మాటలను వినడానికి వీలవుతుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో వీటిని అమర్చి గుట్టుగా వారు మాట్లాడిన మాటలను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి సంభాషణను ప్రణీత్ రావు, రవిపాల్ విన్నారు.

ఇదే కాకుండా రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్ వేర్ కంపెనీల యజమానుల ఫోన్లును ట్యాప్ చేసి వారి ప్రతిపక్ష నాయకులతో మాట్లాడిన మాటలను వారికే వినిపించి.. బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు గుర్తించారు. ఈ ఆడియో కాల్స్ డేటా ఆధారంగా వారిచేత బలవంతంగా ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ కు అందించే విధంగా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ బెదిరించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News