Big Stories

RCB Vs PBKS: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. ఆర్సీబీ బోణి..!

- Advertisement -

Royal Challengers Bengaluru Vs Punjab Kings: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(77), దినేశ్ కార్తీక్ (28*) రాణించడంతో ఆర్సీబీ గెలిచింది.

- Advertisement -

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు కోహ్లీ మొదటి ఓవర్లో 4 బౌండరీలు సాధించి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ మూడో ఓవర్లో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రబాడ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్రీన్ 3 పరుగులు మాత్రమే చేసి రబాడ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఒక పక్క విరాట్ కోహ్లీ తనదైన శైలిలో రెచ్చిపోతుండగా అతనికి సపోర్ట్ కరువైంది. మూడో వికెట్‌కు పటీదార్‌తో కలిసి ఈ జంట 43 పరుగులు జోడించింది. 18 పరుగులు చేసిన పటీదార్ బ్రర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి బ్రర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

Also Read: IPL 2024 Full Schedule: ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఫైనల్ ఎక్కడో తెలుసా..?

77 పరుగులు చేసిన కోహ్లీ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 25 బంతుల్లో 47 పరుగులు కావాల్సి ఉండగా అనూజ్ రావత్ అవుట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. 18 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన సమయంలో లోమ్రోర్ ఫోర్, సిక్స్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. 12 బంతుల్లో 23 కావాల్సి ఉండగా 19వ ఓవర్లో 13 పరుగులు సాధించారు. చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతికి కార్తీక్ 6, రెండో బంతికి ఫోర్ కొట్టి ఆర్సీబీకి తొలి గెలుపును అందించాడు.

అంతకుముందు పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు బెంగళూరు బౌలర్ సిరాజ్ షాకిచ్చాడు. మూడవ ఓవర్ తొలి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టిన బెయిర్ స్టోను అవుట్ చేశాడు. 17 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ధావన్ వన్ డౌన్ బ్యాటర్ ప్రబ్‌సిమ్రాన్ సింగ్‌ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఊపుమీదున్న సింగ్‌(25, 17 బంతుల్లో) భారీ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు.

17 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్‌ను జోసెఫ్ అవుట్ చేయగా, 45 పరుగులు చేసిన ధావన్‌ను మ్యాక్సీ అవుట్ చేశాడు. దీంతో 98 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్, జితేశ్ శర్మ 5వ వికెట్‌కు 52 పరుగులు జోడించారు. జట్టు స్కోర్ 150 పరుగుల వద్ద 23 పరుగులు చేసిన కరన్, యశ్ దయాల్ బౌలింగ్‌లో అనూజ్ రావత్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ అవుట్ అయ్యాడు.

Also Read: CSK vs GT: నిలిచేదెవరు? గెలిచేదెవరు?.. నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్

చివరి ఓవర్లో శశాంక్ సింగ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టడంతో పంజాబ్ 176 పరుగులు చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News