Software Employee Suicide: మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువకుడు కేబుల్ వంతెన పైనుంచి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగింది?
విశాఖపట్నం జిల్లాకు చెందిన రాజేష్ (25) నగరంలోని నాచారం పరిధిలోని ఒక హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రోజున మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న తన మిత్రులను కలిసేందుకు వచ్చాడు. అనంతరం దుర్గం చెరువు అందాలను చూసేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లిన రాజేష్, అనూహ్యంగా అక్కడి నుంచే చెరువులోకి దూకేశాడు.
రంగంలోకి సహాయక బృందాలు
స సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజేష్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెరువులో గల్లంతైన రాజేష్ మృతదేహం కోసం NDRF, DRF బృందాల సహాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే రాజేష్ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read: కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది హరీష్ రావే..! – ఎంపీ చామల