E-Paper
Advertisement

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గ్రానైట్ లారీ బీభత్సం.. క్యాబిన్‌పై పడిన భారీ గ్రానైట్ రాళ్లు, డ్రైవర్ మృతి!

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గ్రానైట్ లారీ బీభత్సం.. క్యాబిన్‌పై పడిన భారీ గ్రానైట్ రాళ్లు, డ్రైవర్ మృతి!
Advertisement

Wyra Accident: ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగ్జిట్-4 వద్ద రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గ్రానైట్ రాళ్లు పడి డ్రైవర్ మృతి

Advertisement

కరీంనగర్ నుంచి కాకినాడ వైపు భారీ గ్రానైట్ రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ (TS 02 UB 8906), అదే దిశలో కల్లూరు వైపు వెళ్తున్న మరొక లారీని (KA 56 9236) వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీలో ఉన్న భారీ గ్రానైట్ రాళ్లు ముందుకు జరిగి క్యాబిన్‌పై పడ్డాయి. దీంతో క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్ షేక్ అనికుల్ తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు.

స్తంభించిన ట్రాఫిక్.. దారి మళ్లింపు

Advertisement

ఈ ఘటనతో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వైరా ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దేవరపల్లి వైపు వెళ్లే వాహనాలను వైరా నుంచి పాత జాతీయ రహదారి మీదుగా దారి మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

స్థానికుల డిమాండ్..

వైరా సమీపంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రీన్‌ఫీల్డ్ హైవేపై తక్షణమే భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఉద్యోగం పేరుతో నమ్మించి రిసార్ట్ కు తీసుకెళ్లి… ఘట్కేసర్‌లో దారుణం!

Tags

Related News

కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది హరీష్ రావే..! – ఎంపీ చామల

క్యాప్.. ఆ స్టూడెంట్ ప్రాణాలు తీసింది.. హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం, ఎలా జరిగింది?

ఉద్యోగం పేరుతో నమ్మించి రిసార్ట్ కు తీసుకెళ్లి… ఘట్కేసర్‌లో దారుణం!

బండ్లగూడలో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి!

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

కేటీఆర్‌,హరీష్ రావు ఇద్దరివి దిమాక్ లేని మాటలు: ఎంపీ చామల ఫైర్!

నేడు హైడ్రా కు 42 ఫిర్యాదులు.. వీటిలో ఎక్కువ సమస్యలు ఇవే..?

Big Stories

Advertisement
×