BigTV English

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

MRPS leader Manda Krishna Madiga Statements cm revanth: సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్భంధాలతో నడుస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాదిగలను నమ్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు విడుదల చేసినా.. ఇక్కడ నమ్మే పరిస్థితి లేదన్నారు.


ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయకుండానే 11వేలకుపైగా టీచర్ల నియామకాలు పూర్తి చేశారని మండిపడ్డారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని, కానీ వాటిని అమలు చేయకుండానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని ఆరోపించారు.

సీఎం పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని, శాసనసభలో చెప్పిన మాటలకు కూడా విలువలేదని విమర్శలు చేశారు. శాంతియుత నిరసన ర్యాలీ చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం ర్యాలీ నిర్వహించి ట్యాంకు బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామని చెబితే అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.


Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×