Farmer Commits Suicide: జన్యుమార్పిడి విత్తనాలకు మరో యువరైతు బలయ్యారు. ములుగు జిల్లా చిరుతపల్లికి చెందిన లోకం మధుకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. హైటెక్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు నాటి నష్టపోయారు మధుకృష్ణ. దీంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
జన్యుమార్పిడి విత్తన సాగుపై సీడ్ బాంబ్ పేరుతో ఇటీవలే బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బిగ్ టీవీ కథనాలతో ఇప్పటికే అధికార యంత్రాంగం కలిపింది. ములుగులో పర్యటించి మొక్కజొన్న కంకులను సేకరించారు వ్యవసాయశాఖ అధికారులు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి సీతక్క కూడా ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా చిరుతపల్లికి చెందిన లోకం మధుకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. హైటెక్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను ఐదెకరాల్లో నాటి నష్టపోయాడు మధుకృష్ణ అనే రైతు. విత్తన కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు దిగుబడి రాకపోవడం, హామీ మేరకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందాడు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక.. పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే MGM ఆస్పత్రికి తరలించినా.. ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ మధుకృష్ణ చనిపోయాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు రైతు ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమని చెప్పాలంటూ కుటుంబసభ్యులపై ఒత్తిడి చేస్తోంది విత్తన కంపెనీ.
సరిగ్గా నెల రోజుల కిందట మధుకృష్ణ తల్లి బిగ్ టీవీతో మాట్లాడారు. పంట పండలేదని, అప్పులు తీర్చే మార్గం లేదని.. ఆత్మహత్యే శరణ్యమని చెప్పారు. తన కొడుకే ఆత్మహత్య చేసుకుంటాడని అప్పుడు ఆమెకు తెలియదు. బిగ్ టీవీతో మధుకృష్ణ తల్లి చిలకమ్మ ఆనాడు ఏమన్నారో చూద్దాం..
తన మనసులోని ఆవేదన అంతా బిగ్ టీవీతో పంచుకున్నారు. చిలకమ్మ. పంట సాగుకు అప్పులు చేయాల్సి వస్తోందని.. దిగుబడి రాకపోతే, అప్పు తీర్చే మార్గమే ఉండదన్నారు. అధిక లాభాల ఆశ చూపి, అగ్రిమెంట్లు లేకుండానే వ్యవసాయం చేయించి, మధుకృష్ణను విత్తన కంపెనీలు నిండా ముంచాయి. దిగుబడి అస్సలు రాకపోవడంతో.. మధుకృష్ణ లక్షల్లో అప్పుల పాలయ్యాడు. కంపెనీ ప్రతినిధులు పరిహారం ఇవ్వకపోగా, బెదిరింపులకు దిగారు. మొక్కజొన్న సాగే మధుకృష్ణ ప్రాణం తీసిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
కాగా గిరిజన రైతులకు మాయమాటలు చెప్పి.. ఊరు, పేరు లేని ఇంటర్నేషనల్ విత్తన కంపెనీల దందా.. పదేళ్లుగా కొనసాగుతోంది. ఆ కంపెనీల ఏజెంట్లను నమ్మి.. రైతులు తరచుగా మోసపోతున్నారు. దాంతో.. ఇవి మొక్కజొన్న సీడ్స్ కోసం ప్రయోగాలా? లేక.. జన్యుమార్పిడి పంటలా అన్నది కలకలం రేపుతోంది. ఎందుకంటే.. జన్యుమార్పిడి ఆహార పంటలు పండించాలంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి.
Also Read: హరీశ్ దెబ్బకు రోడ్డు మీద పడ్డ కేటీఆర్!?
ఇష్టమొచ్చినట్లు.. ఎక్కడపడితే అక్కడ సాగు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. జీన్ మోడిఫైడ్ సీడ్స్‌తో.. జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి ముప్పు ఉంటుంది. మనం తినే ఆహారంలో.. జన్యువులు మారిపోయి అది ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో ఎవ్వరికీ తెలియదు. అస్సలు.. అంచనా కూడా వేయలేం. అందుకే.. ఈ జన్యుమార్పిడి సీడ్స్ అనుమతుల విషయంలో.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు.. ములుగు జిల్లాలో పండిస్తున్న మొక్కజొన్న.. ఏ రకానికి చెందిందన్నదే తేలాల్సి ఉంది.