Mulugu Tribal Farmers: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వందలాది మంది ఆదివాసీ గిరిజన రైతులు.. పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫ్లెక్సీకి.. పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం
ఇటీవల హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌లో.. బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో, వెంకటాపురం బీఆర్‌ఎస్ నాయకుడు గొడవర్తి నరసింహమూర్తి జిల్లా కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు గిరిజన రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. కలెక్టర్ నిజాయితీగా పనిచేసి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తుండగా, ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాకు అవమానం అని రైతులు తీవ్రంగా విమర్శించారు.
కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
వెంకటాపురం మండలంలోని రైతులు ఈ మధ్యకాలంలో.. నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని రైతులకు పరిహారం అందేలా చూశారు. రైతుల న్యాయం కోసం కష్టపడి పనిచేసిన కలెక్టర్‌పై.. ఒక నాయకుడు వ్యాఖ్యలు చేయడం అసహ్యం కలిగిస్తోందని వారు చెప్పారు.
ఈ సందర్భంగా రైతులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, అందులో కలెక్టర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. రైతు రక్షకుడు మా కలెక్టర్ అని నినాదాలు చేశారు.
కేటీఆర్ అనుచరుడిపై ఆగ్రహం
నరసింహమూర్తి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మద్దతుదారులు తెలిపారు.
గిరిజన రైతుల డిమాండ్లు
కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి.
బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
భవిష్యత్తులో అధికారులను బెదిరించే ప్రయత్నాలు మానుకోవాలి.
రైతుల సమస్యల పరిష్కారానికి నిజాయితీగా పనిచేసే అధికారులను ప్రోత్సహించాలి.
Also Read: ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు..
ములుగు జిల్లాలో గిరిజన రైతుల ర్యాలీ మరోసారి.. ప్రజాస్వామ్యంలో రైతుల శక్తి ఎంత గొప్పదో చూపించింది. తాము నష్టపోయిన సమయంలో.. కలెక్టర్ సహాయం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, అవమానించే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా రైతులు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నారు.