Big Stories

Munugode by poll : కేటీఆర్ కు ఓటర్ల షాక్.. కాల్ చేసి బుక్ అయిన మంత్రి!

Munugode by poll: ఓటర్లు తెగ హుషార్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ.. తమ తీరని సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. మా పని చేసి పెడతారా? లేదా? లేదంటే, మేం ఓటు వేయం.. అంటూ బెదిరిస్తున్నారు. వట్టి మాటలే కాదు.. అన్నట్టుగానే చేసి చూపించారు గట్టుప్పల్ మండలంలోని రంగాతండా వాసులు. పోలింగ్ కు దూరంగా ఉండి పోయారు. ఏళ్లుగా గ్రామానికి రోడ్డు వేయడం లేదంటూ పోలింగ్ ను బహిష్కరించారు.

- Advertisement -

ఓటర్ల దెబ్బకు దిగొచ్చారు మంత్రి కేటీఆర్. ఎందుకంటే, గట్టుప్పల్ మండలానికి కేటీఆరే ఇంఛార్జిగా ఉన్నారు. మునుగోడులో ప్రతీఓటు కీలకం కావడంతో.. చేసేది లేక స్వయంగా మంత్రి కేటీఆరే రంగంలోకి దిగారు. రంగతండ, హజిన తండా వాసులతో ఫోన్ లో మాట్లాడారు. మీ పనులన్నీ చేసిపెడతా.. వచ్చి ఓటేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఆ రెండు తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని.. రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

- Advertisement -

ప్రచారం ముగిశాక.. పోలింగ్ కంప్లీట్ అయ్యే వరకు నేతలు ఎలాంటి హామీలు ఇవ్వడానికి కుదరదు. ఆ మేరకు ఈసీ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. హామీలతో మంత్రి కేటీఆర్ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేటీఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో లీక్ అవడంతో.. మంత్రి అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News