Target Pakistan Actress : T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఎలాగైనా సెమీస్ చేరితే చూడాలని.. ఆ జట్టు అభిమానులు తహతహలాడిపోతున్నారు. బంగ్లాదేశ్ పై పాక్ భారీ విజయం నమోదు చేయడంతో పాటు… తమను ఓడించిన జింబాబ్వే చేతిలో టీమిండియా కూడా ఓడిపోవాలని, సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకివ్వాలని… అప్పుడే పాకిస్థాన్ సెమీస్ చేరుతుందని లెక్కలేసుకుంటున్నారు. కొందరైతే… జింబాబ్వే ప్లేయర్లకు బంపరాఫర్ కూడా ఇస్తున్నారు. జింబాబ్వే భారత్ ను ఓడిస్తే… ఆ జట్టు ఆటగాడిని పెళ్లి చేసుకుంటానని, పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ ప్రకటించింది. సూపర్-12 మ్యాచ్ లో జింబాబ్వే అద్భుతంగా ఆడి భారత్ ఓడిస్తే… ఆ దేశానికి చెందిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటా అని ట్వీట్ చేసింది. గతంలో కూడా ఈమె టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ అనేక ట్వీట్లు చేసింది. బంగ్లాదేశ్ చేతిలోనూ భారత్ ఓడిపోవాలని కోరుకుంటూ సెహర్ షిన్వారీ ట్వీట్ చేసింది. ఇటీవలే భారత్ లో పర్యటించిన ఆసీస్… రోహిత్ సేనను ఓడించినప్పుడూ ఆమె విమర్శలు చేసింది. ప్రతీసారీ భారత్ ఫ్యాన్స్ తో చివాట్లు తినింది. ఇప్పుడు కూడా ఆమె టీమిండియా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారింది.
సెహర్ షిన్వారీపై భారత అభిమానులు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో తన అంచనాలు తలకిందులైనా… మళ్లీ ఆమె అదే తప్పు చేస్తున్నారు… పాపం… పెళ్లి చేసుకోకుండా జీవితమంతా ఒంటరిగా ఎలా జీవిస్తారో తలుచుకుంటేనే బాధగా ఉంది’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం… జింబాబ్వేను భారత్ ఓడిస్తే మీరు మీ ట్విటర్ అకౌంట్ ను క్లోజ్ చేయాలని సెహర్ ను డిమాండ్ చేస్తున్నారు. జింబాబ్వే ఒక్క పరుగుతో ఓడించడానికి మాది పాకిస్తాన్ జట్టు కాదంటూ ఇంకొందరు చురకలంటిస్తున్నారు.