E-Paper
Advertisement

Munugodu Political History : మునుగోడు రాజకీయ చరిత్ర

Munugodu Political History : మునుగోడు రాజకీయ చరిత్ర
Advertisement

Munugodu Political History : మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం… అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా చెప్పవచ్చు. 1967 లో తొలిసారి మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ముందు నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మునుగోడులో కమ్యూనిస్టుల ప్రాబల్యం కూడా ఎక్కువే. ఉజ్జిని నారాయణరావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజ్‌గోపాల్ రెడ్డి… బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన ఉపఎన్నికలో 93.13 శాతం భారీ పోలింగ్ నమోదయింది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 41వేల 855 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2లక్షల 25వేల 192 మంది ఓటు వేశారు. ఇందులో 686 పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలవగా…. ఓటరు ఎవరి పట్టం కట్టారో ఇవాళ తేలనుంది.

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×