BigTV English

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం..6 గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం..6 గేట్లు ఎత్తివేత

Nagarjunasagar Crust Gates Lifted: నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది. దీంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను ఎన్‌ఎస్పీ అధికారులు సోమవారం ఎత్తివేశారు.


సాగర్ నుంచి ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక్కో గేట్ నుంచి సుమారు 5 నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వెంటనే అధికారులు నాగార్జునసాగర్ దిగువన ప్రాంతాలకు హైఅలర్ట్ జారీ చేశారు. నాగార్జున సాగర్ దిగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు నాగార్జునసాగర్ గేట్లు తెరిచారు.

దిగువన కృష్ణా నది ప్రాంతాల అప్రమత్తత కోసం మూడు సెరైన్లను అధికారులు మోగించారు. అంతకుముందు అధికారులు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఓపెన్ చేశారు. సుమారు 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Also Read: పాల్వంచ కేటీపీఎస్‌లో 8 కూలింగ్‌ టవర్ల కూల్చివేత

కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జునసాగర్‌లో రోజురోజుకు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 4 లక్షల 41 వేల క్యూసెక్కులకు పైగా ఉంది. ఇదిలా ఉండగా, నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా..ప్రస్తుతం నీటి మట్టం 580 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా..ప్రస్తుతం 284 టీఎంసీలు ఉన్నాయి.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×