BigTV English

Naveen: నవీన్ బాడీ పార్ట్స్ బ్యాగులో తీసుకెళ్లి.. హంతకుడు హరి వికృత చేష్టలు..

Naveen: నవీన్ బాడీ పార్ట్స్ బ్యాగులో తీసుకెళ్లి.. హంతకుడు హరి వికృత చేష్టలు..

Naveen: బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు తెలుస్తున్నాయి. చేతి వేళ్లు కట్ చేయడం.. పెదాలు తెగ్గోయడం.. ఛాతిని చీల్చి గుండెను బయటకు తీయడం.. కడుపులోంచి పేగులు లాగేయడం.. మర్మాంగాలను కోసేయడం.. హరి ఉన్మాద చేష్టలు వింటుంటే పోలీసులకే మైండ్ బ్లాంక్ అవుతోంది. అంత దారుణంగా నవీన్‌ను చంపేశాడు హరిహరకృష్ణ.


ఏదో క్షణికావేశంలోనో, మద్యం మత్తులోనో చేసిన హత్య కాదని తెలుస్తోంది. నిందితుడు మూడు నెలలుగా పక్కా ప్లాన్డ్‌గా ఉన్నాడు. డిమార్ట్‌లో కత్తి కొని.. బండ్లో పెట్టుకుని తిరుగుతున్నాడు. తన లవర్ కోసం నవీన్ ట్రై చేస్తున్నాడనే కోపంతో పగ, కసి పెంచుకున్నాడు. గెట్ టు గెదర్ పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి.. జనవరి 16నే చంపాలని చూశాడు. కానీ, ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో.. ఫిబ్రవరి 17న మళ్లీ ప్లాన్ చేసి చంపేశాడు.

ఫిబ్రవరి 17న రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్‌ తిరుమల వైన్స్‌ దగ్గర నవీన్‌, హరిహరకృష్ణ మద్యం సేవించినట్లు సీసీఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి అయ్యే వరకు.. ఎల్బీనగర్‌, నాగోల్‌, ముసారంబాగ్‌, సైదాబాద్‌, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో ఇద్దరూ కలిసి తిరిగారు. రాత్రి 12 గంటలకు యువతి ప్రేమ విషయంలో గొడవ పడ్డారు. ఓఆర్‌ఆర్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో నవీన్‭ను గొంతు నులిమి హత్య చేశాడు హరి.


హత్య తర్వాత శరీరం నుంచి తల, వేళ్లు, ఇతర భాగాలను కత్తితో వేరు చేసి బ్యాగులో వేసుకొని పరారయ్యాడు. వాటిని తీసుకెళ్లి బ్రాహ్మణపల్లి పరిధిలోని రిమోట్ ఏరియాలో పడేశాడు. ఆ తర్వాత హరిహరకృష్ణ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లి.. అక్కడే స్నానం చేసి డ్రెస్ మార్చుకొన్నాడు. నవీన్‌ను చంపిన విషయం హసన్‌కు చెప్పాడు. మరుసటి రోజు ప్రియురాలికి కూడా చెప్పాడు.

ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నంలో రెండు రోజుల పాటు గడిపాడు. ఫిబ్రవరి 23న తిరిగి వరంగల్‌ చేరుకొని తండ్రికి హత్య గురించి చెప్పాడు. పోలీసులకు లొంగిపొమ్మని తండ్రి సూచించాడు. 24న మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి.. బ్రహ్మణపల్లిలో తాను పడేసిన నవీన్ శరీర విడిభాగాలను సేకరించి తగలబెట్టాడు. అదే రోజు సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×