BigTV English

Kaleshwaram Project: కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కమిటీ విచారణ.. ఇంజినీర్ల నుంచి సమాచారం సేకరణ

Kaleshwaram Project: కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కమిటీ విచారణ.. ఇంజినీర్ల నుంచి సమాచారం సేకరణ

 


NDSA committee on Kaleshwaram project

NDSA committee on Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. ఎన్డీఎస్ఏ టీమ్ విచారణ చేపట్టింది. ప్రాజెక్టు ఇంజినీర్ల నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రాజెక్టు పునాది పనులపై ఎన్డీఎస్ఏ సభ్యులు ఆరా తీశారు. అప్పుడు పరిశీలించాలని అంశాలను చెప్పాలని కోరారు. పునాది పనుల్లో పరిశీలించిన అంశాలను రికార్డుల్లో నమోదు చేశారా అని ప్రశ్నించారు. బ్యారేజీల్లో బ్లాకుల వారీగా జరిగిన పనుల వివరాలు ఇవ్వాలని కోరారు.


అసిస్టెంట్‌ ఇంజినీర్‌ నుంచి చీఫ్‌ ఇంజినీర్‌ వరకు అందర్నీ లోతుగా ఎన్డీఎస్ఏ టీమ్ సభ్యులు ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలను తెలుసుకోవడానికి కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమీటీ హైదరాబాద్ వచ్చింది. జలసౌధలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నుంచి సమాచారం సేకరించింది. అంతుకుముందు సమస్యలున్న మూడు బ్యారేజీలను కమిటీ పరిశీలింది.

ఎన్డీఎస్ఏ సమావేశానికి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ హాజరయ్యారు. కమిటీ సభ్యులు ఇంజినీర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాలను సేకరించారు. అలాగే ఇంజనీర్ల నుంచి సంతకాలు తీసుకున్నారు.

Read More: వారికి నగర బహిష్కరణ శిక్ష.. బైరామల్​ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి..

2016 నుంచి మేడిగడ్డ నిర్మాణానికి అనుసరించి పద్ధతులపై ఎన్డీఎస్ఏ కమిటీ ఆరా తీసింది. బోర్ వెల్ డేటా , పునాదుల పరీక్షలపై సమాచారం కోరింది. మేడిగడ్డ ప్రాజెక్టు పునాదుల సమయంలో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఓంకార్ సింగ్, రమణారెడ్డి, తిరుపతిరావును ప్రశ్నించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను విచారించారు. ఈ ప్రాజెక్టుకు ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పనిచేసిన వెంకటేశ్వర్లు కమిటీ సమావేశానికి హాజరుకాలేదు. బ్యారేజీలు నిర్మించిన ఎల్ అండ్ టీ, ఆప్కాన్స్, నవయుగ కన్ స్ట్రక్షన్ సంస్థలతో కమిటీ చర్చించింది.సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్ ఇంజినీర్లను ఢిల్లీలో రావాలని కమిటీ కోరింది. అయితే అక్కడకు రాలేమని సీడీఏ ఇంజినీర్లు స్పష్టం చేశారు.

మేడిగడ్డ ప్రాజెక్టులో మే నుంచే ప్రాణహిత నదికి వరద వస్తుందని నీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ ఎన్డీఏస్ఏ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. బ్యారేజ్ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరమ్మతు పనులకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. నివేదిక ఇచ్చేందుకు కమిటీకి 4 నెలలు గడువు ఉన్న నేపథ్యంలో మధ్యంతర సిఫార్సులు చేయాలని సూచించారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×