Juniors vs Seniors: సీనియర్లైనా, జూనియర్లైనా.. కాలేజీలో అడుగుపెట్టాక.. అంతా స్టూడెంట్స్ మాత్రమే. అంతా స్నేహపూర్వకంగా ఉండి చదువుకుంటే.. కాలేజీ రోజులు ఎంతో బావుంటాయ్. ప్రతిక్షణం గుర్తుండిపోతుంది. అయితే.. ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలు చూశాక.. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో మళ్లీ ర్యాగింగ్ పడగ విప్పినట్లు కనిపిస్తోంది. అసలు.. ఈ కల్చర్ మళ్లీ ఎందుకు పెరుగుతోంది.
నిజామాబాద్ మెడికల్ కాలేజీలో జూనియర్స్ Vs సీనియర్స్
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఎందరో విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతోంది. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో.. ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్, జూనియర్ మెడికలో ఘర్షణకు దిగారు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్‌ని.. సీనియర్లు వేధించారు. ఎదురుతిరిగి ప్రశ్నించినందుకు.. రాహుల్‌ని సీనియర్లు చితకబాదారు. గాయాలపాలైన రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలోనూ.. అర్ధరాత్రి దాకా పంచాయితీ జరిగింది. దాంతో.. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వాళ్లు.. ర్యాగింగ్ విషయం బయటపడకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుడికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థిపై దాడి చేసిన ఐదుగురు
ఇదే నెలలో.. ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇద్దరు కాలేజీ విద్యార్థులపై.. తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. ఐదుగురు కలిసి ఓ విద్యార్థిని కిరాతకంగా కొట్టారు. హాస్టల్‌కి తీసుకెళ్లి కొట్టి, కరెంట్ షాక్ పెట్టి చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరుస ఘటనలతో ర్యాగింగ్ భూతంపై మళ్లీ చర్చ
ఈ వరుస ఘటనలు చూశాక.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ర్యాగింగ్ పెరుగుతోందనే చర్చ మొదలైంది. ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలు, కమిటీలు ఉన్నప్పటికీ.. చాలా విద్యా సంస్థల్లో వాటి అమలు సరిగ్గా జరగడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని సందర్భాల్లో, కాలేజీ యాజమాన్యాలు తమ సంస్థ పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉండటానికి ర్యాగింగ్ ఘటనలను బయటకు రానీయకుండా దాచిపెడుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. సామాజికంగానూ, మానసికంగానూ విద్యార్థుల్లో అనేక మార్పులు వస్తున్నాయి.
ఐదుగురు విద్యార్థుల ఇంటెన్స్ ఆరు నెలల పాటు రద్దు
ప్రెజర్, కాంపిటీషన్, డ్రగ్స్ వినియోగం లాంటి వ్యసనాలు కూడా.. వారిలో క్రూర ఆలోచనలు తెప్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం, డ్రగ్స్ వాడకం పెరగడం వల్ల.. ర్యాగింగ్ ఘటనలు పెరుగుతున్నట్లు తేల్చాయి. ముఖ్యంగా.. అనేక విద్యాసంస్థలు.. విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల జరిగే నష్టాలపై సరైన అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయ్. ర్యాగింగ్‌ని ఎలా కట్టడి చేయాలి? ఏవిధంగా ఎదుర్కోవాలి? ఎవరిని సంప్రదించాలి? లాంటి విషయాలపై వారికి సరైన సమాచారం లభించడం లేదు.
Also Read: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?
పోలీస్ శాఖ నివేదిక తర్వాత చర్యలు తీసుకున్న ప్రిన్సిపాల్
పోలీస్ శాఖ నివేదిక తర్వాత చర్యలు తీసుకున్న ప్రిన్సిపాల్ కేవలం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ర్యాగింగ్ ఘటనలు పెరుగుతున్నాయి. కేంద్రం నివేదిక ప్రకారం.. గతేడాది దేశంలోని మెడికల్ కాలేజీల్లో 165 ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గతంలో కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సమస్యని పూర్తిగా అరికట్టేందుకు.. అంతా కృషి చేయాల్సిన అవసరముందంటున్నారు.