BigTV English

Mathu vadalara: బయ్యర్లకు లాభాల పంట పండిస్తున్న మత్తు వదలరా 2 టోటల్ కలెక్షన్లు ఇవి

Mathu vadalara: బయ్యర్లకు లాభాల పంట పండిస్తున్న మత్తు వదలరా 2 టోటల్ కలెక్షన్లు ఇవి

Mathu vadalara movie running successfully with huge profits: ఈ మధ్య భారీ బడ్జెట్ అంటూ..పాన్ ఇండియా రేంజ్ అంటూ ఊదరగొట్టేస్తున్న సినిమాలు బాక్సీఫీసు వద్ద చతికిలపడుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు కటౌట్లు అక్కర్లేకుండానే అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. టెల్లు స్వ్కేర్, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ లేటెస్ట్ గా మత్తు వదలరా 2 విషయంలో తేలిన లెక్కలవే. భారీ బడ్జెట్ మూవీస్ అంటూ ఓ రేంజ్ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్లా కొట్టాయి. ప్రేక్షకులు కూడా మార్పు కోరుకుంటున్నారు. కంటెంట్ లేకుండా భారీ ఖర్చు పెడితే ఏం లాభం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలగాలి.


తక్కువ బడ్జెట్ మూవీ

తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు వచ్చే సినిమాలవైపు ప్రస్తుతం నిర్మాతలు దృష్టిపెట్టారు. పెద్ద హీరోలు సైతం నిర్మాతలుగా మారి లో బడ్జెట్ మూవీస్ ని తీస్తున్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైన వాతావరణం అని సినిమా పరిశ్రమకు ఊతం ఇచ్చినట్లువుతుందని..దీని వలన మరిన్ని చిన్న సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. భారీ బడ్జెట్ అంటూ సంవత్సరాల తరబడి ఒక్క సినిమా తీసేకన్నా కనీసం చిన్న సినిమాలు ఎక్కువగా తీస్తే ఎక్కువ మంది సినీ కార్మికులకు కూడా ఉపాధి లభించినట్లవుతుందని దీని వలన చిత్ర పరిశ్రమ కూడా పది కాలాల పాటు వర్థిల్లుతుందని సినీ పెద్దలు అంటున్నారు. ఇప్పుడు మత్తు వదలరా 2 మూవీ కూడా చాలా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కింది. 2019లో రిలీజయిన తొలి భాగం సూపర్ హిట్ అవడంతో రెండో భాగాన్ని తెరకెక్కించారు దర్శకుడు రితీష్ రానా.


అన్ని చోట్లా హౌస్ ఫుల్

దాదాపు ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మత్తు వదలరా 2 విడుదలైన తొలి షో నుంచే అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల మత్తు వదిలించేస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాలలో ఇప్పటిదాకా అన్ని షోలు హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. సోమవారం నుంచి మరిన్ని కేంద్రాలలో ప్రదర్శితమయ్యేలా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక మూడో రోజునుంచే బయ్యర్లకు లాభాల పంట పండిస్తోంది. దానికి తోడు మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీని చూసి తమ స్పందనలు తెలియజేశారు. దానితో తమ అభిమాన హీరోలు చెప్పారని ఈ సినిమాను ఒకటికి రెండు సార్లు అభిమానులు చూసేస్తున్నారు.

Also Read:  జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..

రూ.80 కోట్ల లాభాలు

సత్య కామెడీ ఇరగదీశాడని, అలాగే వెన్నెల కిశోర్ కూడా బాగానే నవ్వించాడని, శ్రీసింహా నటన, ఫరియా అబ్దుల్లా వంటి నటీనటులంతా పరిధుల మేరకు నటించడంతో ఈ సినిమా ఇప్పటికే హిట్ రేంజ్ కి చేరుకుంది. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో రూపొందించారు కాబట్టి దీని బిజినెస్ రూ.4 కోట్ల మేరకు జరిగింది. కేవలం రెండు రోజుల్లోనే మత్తు వదలరా 2 మూవీ రూ.4.81 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం రూ.80 కోట్ల లాభాలతో నడుస్తోంది. ఈ సినిమాకు వరస వీకెండ్ సెలవలు కలిసొచ్చాయి. ఆదివారం కూడా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ తో నడిచింది. ఇక సోమ, మంగళవారాలు తెలంగాణలో సెలవలు కావడంతో లాభాలు కూడా రెట్టింపు రేంజ్ లో వచ్చేలా ఉన్నాయి. ఈ వారంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం ఈ మూవీకి కలిసొచ్చే అంశంగా నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పుడు థియేటర్ల సంఖ్యను పెంచితే ఈజీగా ఈ సినిమా రూ.25 కోట్లను రాబడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×