E-Paper
Advertisement

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. ఒకే ఇంట్లో 70 తులాల బంగారం మాయం!

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. ఒకే ఇంట్లో 70 తులాల బంగారం మాయం!
Advertisement

Hyderabad Theft: హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు కాసేపు బయటకు వెళ్లడమే ఆలస్యం, దొంగలు తమ చేతివాటం ప్రదర్శించి ఏకంగా 70 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే..

Advertisement

ఆసిఫ్‌నగర్‌లోని జేబా బాగ్ డి-క్లాస్ ప్రాంతంలో మహమ్మద్ వాసిం తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. నిన్న సాయంత్రం వాసిం కుటుంబ సభ్యులంతా కలిసి ఏదో పని నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు, ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన సుమారు 70 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

రంగంలోకి పోలీసులు

Advertisement

రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన వాసిం కుటుంబ సభ్యులు, తలుపులు తెరిచి ఉండటం, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బీరువాలో ఉన్న బంగారం మాయమైనట్లు గుర్తించి వెంటనే ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read: నాడు అలా.. నేడు ఇలా! అమరావతి నిర్మాణ వేగంపై లోకేశ్‌ పవర్‌ఫుల్ వీడియో!

Tags

Related News

కేపీహెచ్‌బీలో విషాదం.. కార్తిక దీపం అంటుకుని యువతి మృతి

రేవంత్, రాహుల్ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు: రాంచందర్ రావు

ప్రతి 17 గంటలకో బాల్య వివాహం.. తెలంగాణలో షాకింగ్ గణాంకాలు.. రంగంలోకి పోలీస్ శాఖ!

విదేశీ ఉద్యోగాల కోసం సీఎం కొత్త పథకం.. పూర్తి వివరాలు ఇవే!

గాంధీ భవన్‌లో నేతల వరుస భేటీలు.. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారానికి మెర్జ్ ఫార్ములా!

హైదరాబాద్‌లో గంజాయి కలకలం.. 29.810 కిలోలు సీజ్‌.. లాడ్జి మేనేజర్ సహా ముగ్గురు అరెస్ట్

జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసుల్లో వరుస అగ్ని ప్రమాదాలు.. ప్రమాదమా? కుట్రా?

Big Stories

Advertisement
×