Karthika Deepam: పవిత్రమైన కార్తిక మాసంలో వెలిగించిన దీపమే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్న వయసులోనే సొంతంగా బొటిక్ నిర్వహిస్తూ ఎన్నో కలలతో ముందుకు సాగుతున్న యువతి జీవితాన్ని అగ్నికీలలు అర్ధాంతరంగా కబళించాయి. హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పరిధిలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇంటి గేటు వద్దే పొంచి ఉన్న మృత్యువు
కేపీహెచ్‌బీ పరిధిలోని అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌కు చెందిన 18 ఏళ్ల సాయి వెంకట సింధు బొటిక్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 12వ తేదీ రాత్రి తన షాపు మూసివేసి ఎప్పటిలాగే ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి గేటు వద్ద వెలిగించి ఉంచిన కార్తిక దీపం ప్రమాదవశాత్తు ఆమె కట్టుకున్న చీరకు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు ఒంటికి వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడింది.
చికిత్స పొందుతూ కన్నుమూత
కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మంటలను ఆర్పారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన సింధు.. చికిత్స పొందుతూ మృతి చెందింది. 18 ఏళ్ల చిన్న వయసులోనే బిడ్డ దూరమవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కార్తిక దీపం అంటుకుని యువతి మృతి
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధి అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌కు చెందిన 18 ఏళ్ల సాయి వెంకట సింధు (బొటిక్ నిర్వాహకురాలు) కార్తిక దీపం అంటుకుని మృతి చెందారు. ఈ నెల 12న రాత్రి షాప్ నుంచి ఇంటికి వస్తుండగా గేటు వద్ద దీపం చీరకు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి.… pic.twitter.com/YPvwdaEjrZ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2026
Also Read: రేవంత్, రాహుల్ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు: రాంచందర్ రావు