BigTV English

Congress Government: నియంత పాలన నుంచి ప్రజాపాలన.. నెలరోజుల కాంగ్రెస్ పాలనలో కీలక మార్పులు

Congress Government: నియంత పాలన నుంచి ప్రజాపాలన.. నెలరోజుల కాంగ్రెస్ పాలనలో కీలక మార్పులు

Congress Government: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి సరిగ్గా నేటికి నెల రోజులవుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన పగ్గాలు చేతపట్టిన మాసం రోజుల్లో తన మార్క్‌ ఏంటో చూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతిభవన్‌ కంచెలను తొలగించి, ఆ వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మార్చడంతో..
ఒకే ఒక్కడులో ఒక్కరోజు ముఖ్యమంత్రి అర్జున్‌ పాత్ర, భరత్‌ అనే నేనులో సీఎంగా మహేష్‌బాబు పాత్ర అందరికీ గుర్తొచ్చేలా సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించారు. ప్రజాపాలనే తన ధ్యేయమన్న రేవంత్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.


సీఎం రేవంత్‌రెడ్డి అధికారాన్ని చేపట్టగానే 6 గ్యారెంటీ స్కీంలపై ఫోకస్‌ పెట్టారు. ముందుగా మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి కాంగ్రెస్‌ సర్కార్‌పై భరోసానిచ్చారు. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి.. జనం గోడును వినేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గ్యారెంటీ స్కీంల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమంతో లబ్దిదారుల వివరాలు సేకరించడం కూడా పూర్తి చేశారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరాక ఎప్పుడో సమీక్షతో సచివాలయం మంత్రులతో కళకళలాడుతోంది. ప్రజా సమస్యలపై ఫోకస్‌ పెట్టిన సర్కార్‌.. సమీక్షల్లో ఆయాశాఖలకు సంబంధించిన రివ్యూలు నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఒకప్పటి బీఆర్‌ఎస్‌ పాలనలో పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎంలు, మంత్రులు.. ఏది చెప్పాలన్నా, ఏది చేయాలన్నా కేసీఆర్‌, కేటీఆర్ మాటే వేదవాక్కు అనేలా నడిచింది. అయితే.. దానికి వ్యతిరేకంగా రేవంత్‌పాలన సాగుతోంది. డిప్యూటీ సీఎం ప్రొటోకాల్‌ను విధిగా అమలు చేస్తున్నారు రేవంత్‌. అన్ని కీలక రివ్యూల్లోనూ ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భాగస్వామ్యమవుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు ఇద్దరూ ఢిల్లీ వెళ్లారు.


రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై ఇద్దరూ కలిసి ప్రధానితో చర్చించారు. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్‌తో భేటీ సందర్భంలోనూ రేవంత్‌, భట్టిలు కలిసే ఆయనతో చర్చలు జరిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి ఉంచి అభివృద్ధిలోకి తీసుకువచ్చే క్రమంలో ప్రతీ మంత్రికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు సీఎం రేవంత్‌. అందుకే స్వతాహగా ఎవరికి వారు వారికి కేటాయించిన శాఖల్లో సమీక్షలతో బిజీ అవుతున్నారు. దీంతో నెల రోజుల్లోనే బీఆర్ఎస్‌ నియంత పాలనకు.. కాంగ్రెస్‌ అధికారంలో ప్రజాపాలనకు తేడా ఏంటో తెలిశాక రేవంత్‌ ను అందరూ ప్రశంసలంతో ముంచెత్తుతున్నారు.

.

.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×