BigTV English

Online Shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్.. బట్టలు ట్రై చేసి చూడవచ్చు..!

Online Shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్.. బట్టలు ట్రై చేసి చూడవచ్చు..!

Online Shopping: షాపింగ్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువమంది ఉంటారు. బయటికి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక లేకపోయినా.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇంట్లోనే షాపింగ్ చేసేయవచ్చు. కానీ ఆఫ్‌లైన్ షాపింగ్‌కు, ఆన్‌లైన్ షాపింగ్‌కు చాలా తేడా ఉంటుంది. ఆన్‌లైన్ చూసిన ప్రొడక్ట్ బయట అచ్చం అలాగే ఉంటుందా, కలర్, డిజైన్ అనేవి అచ్చం అలాగే ఉంటాయా..? ఇలా కస్టమర్లకు పలు అనుమానాలు ఉంటాయి. కస్టమర్ల అనుమానాలు పోవడం కోసమే పరిశోధకులు ఒక కొత్త టెక్నాలజీతో ముందుకొచ్చారు.


ముఖ్యంగా ఆఫ్‌లైన్ షాపింగ్ విషయంలో కస్టమర్ల అతిపెద్ద సందేహం ఫిట్ సరిగా ఉంటుందా లేదా అని. దీనికి పరిష్కారంగా వర్చువల్ ట్రై ఆన్ అనే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అంటే కస్టమర్లు ముందుగా తమను పోలిన అవతార్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత తమకు నచ్చిన బట్టలను ఆ అవతార్‌కు వేసి చూడాలి. ఇలా చూస్తే వారు సెలక్ట్ చేసుకున్న బట్టలు వారికి సూట్ అవుతాయా, ఫిట్ సరిగా ఉందా లేదా, వారు సెలక్ట్ చేసిన వాటిలో ఏది బెటర్ లాంటి విషయాలు బయటపడతాయి. కానీ ఈ టెక్నాలజీ పట్ల కస్టమర్లలో పలు సందేహాలు మొదలయ్యాయి.

ఏదైనా కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వస్తే.. ముందుగా కస్టమర్లు దాని వల్ల ప్రైవసీకి ఏమైనా భంగం కలుగుతుందా అనే విషయాన్ని ఆలోచిస్తారు. వర్చువల్ ట్రై ఆన్ టెక్నాలజీ విషయంలో కూడా వారికి అలాంటి సందేహాలే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జెనరేషన్‌లో మనుషులకు సంబంధించిన ఏ సమాచారం అయినా ఈజీగా బయటికి వెళ్తోంది, సమాచారం విషయంలో ముఖ్యంగా యూత్ చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ వర్చువల్ ట్రై ఆన్ విషయంలో మనుషులకు సంబంధించిన చాలా సమాచారం బయటికి వెళ్తుతుందని నిపుణుల్లో సైతం సందేహాలు నెలకొన్నాయి.


వర్చువల్ ట్రై ఆన్ విషయంలో ముందుగా అవతార్ క్రియేట్ చేయాలంటే.. ఎత్తు, బరువు, బ్రా సైజ్, బాడీ షేప్ లాంటి సమాచారాన్ని అందించాలి. ఆ తర్వాత వారు ఇచ్చే ఒక శాంపుల్ జాకెట్‌ను ట్రై చేసి స్క్రీన్‌షాట్ తీసి వారికి పంపాలి. దాని తర్వాత ఫీడ్‌బ్యాక్ అడుగుతుంది. వర్చువల్ ట్రై ఆన్ విషయంలో యూజర్లే స్వయంగా తమ సమాచారాన్ని బయటపెడుతున్నారు. అయినా కూడా ఇప్పటివరకు అయితే వర్చువల్ ట్రై ఆన్ నుండి సమాచారం బయటికి వెళ్లినట్టు వారి దగ్గర సమాచారం లేదని నిపుణులు చెప్తున్నారు. అయినా కూడా యూజర్లను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.

Related News

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

MLA Madhavi Reddy: కుర్చీకోసం కలెక్టర్ పై ఎమ్మెల్యే ఫైర్.. చివరకు నిలబడే..

Big Stories

×