BigTV English

Yashswini Reddy First Speech: అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఫస్ట్ స్పీచ్.. ఏం మాట్లాడారంటే?

Yashswini Reddy First Speech: అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఫస్ట్ స్పీచ్.. ఏం మాట్లాడారంటే?

Palakurti MLA Yashswini Reddy First Speech: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సమావేశాల్లో పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అసెంబ్లీలో మొదటిసారిగా మాట్లాడారు. తన నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా రుణమాఫీ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.


‘గత బీఆర్ఎస్ పాలనలో విద్యారంగంపై దృష్టి సారించలేదు. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదు. పల్లెబాట కార్యక్రమంలో ఊర్లలో పర్యటిస్తున్న సమయంలో ఆ స్కూళ్లను చూస్తుంటే ఎంతో బాధ కలిగింది. టాయిలెట్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఉన్న చోట వాటి మెయింటెనెన్సే లేదు. విద్యార్థులు కింద కూర్చోని చదువుకుంటున్నారు. ఇదే కాకుండా విద్యార్థులకు తగ్గట్టుగా స్కూళ్లలో ఉపాధ్యాయులు లేరు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడంలేదు. ఈ కారణాల వల్ల ఎంత పేదవారైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలోకే పంపిస్తున్నారు. వేర్లు మంచిగా ఉంటేనే చెట్లు మంచిగా ఉంటాయి. స్కూల్స్ మంచిగా ఉంటేనే విద్యార్థుల భవిష్యత్ మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగం క్రమంగా మెరుగుపడుతుంది. ఇంకాస్త దృష్టి సారించాలి. విద్యారంగంలో విషయంలో గత ప్రభుత్వం చేయలేని పనులను మన ప్రభుత్వం చేసి చూపించాలి. స్కూళ్లలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి.

విద్యారంగానికి మన ప్రభుత్వం బడ్జెట్ లో అత్యధికంగా నిధులను కేటాయించినందుకు సంతోషంగా ఉంది. దీనిని బట్టే అర్థమవుతుంది.. విద్యారంగానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నదో అనేది.


Also Read: బిగ్ బ్రేకింగ్.. రైతులకు మరో భారీ శుభవార్త

పాలకుర్తిలో నియోజకవర్గంలోని దేవాదుల ప్రాజెక్టు కింద ప్యాకేజి సిక్స్ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీనిని పూర్తి చేస్తే ఎంతోమంది రైతులకు మేలు జరుగుతది. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 35 శాతం పనులను కూడా కంప్లీట్ చేయలేదు. రైతులంటే వారికి అంత చిన్న చూపా?. కానీ, మన ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం.. అందువల్ల దీనిని వెంటనే పూర్తి చేయాలి.

కాలువల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. గత ప్రభుత్వం కాలువలను పట్టించుకోలేదు. పైగా వారు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడువాలో అర్థం కావడంలేదు. మేమే మా సొంత డబ్బులతో 30 కిలో మీటర్లకు పైగా కాలువల్లో పెరిగిన చెట్లను తొలగించాం.

రుణమాఫీ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని నిరూపించాం. రుణమాఫీ విషయంలో గర్వంగా ఉంది. రుణమాఫీ చేసినందుకు ప్రభుత్వానికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అంటూ ఆమె పేర్కొన్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×