BigTV English

Calcium Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే క్యాల్షియం తగ్గినట్టే

Calcium Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే క్యాల్షియం తగ్గినట్టే

Calcium Deficiency: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అందుకు తగినంత క్యాల్షియం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ క్యాల్షియం చాలా ముఖ్యమైంది. ఎముకలు బలంగా ఉండాలన్న.. గుండె సహా కండరాలు సంకోచాన్ని నియంత్రించాలన్నా.. దంతాలు దృఢంగా ఉండాలన్నా, నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా, అన్నింటికి క్యాల్షియం అవసరం.


అంతే కాకుండా హార్మోన్ల ఉత్పత్తిలో, కణాల సిగ్నలింగ్ వ్యవస్థలోనూ, ఎంజైమ్‌ల పనితీరులో కూడా క్యాల్షియం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలో క్యాల్షియం తగ్గితే కొన్ని లక్షణాల ద్వారా మనకు శరీరం ఆ విషయాన్ని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాలుష్యం లోపిస్తే కనిపించే లక్షణాలు:
తిమ్మిర్లు:
కండరాల పనితీరులో క్యాల్షియం కీలకమైంది. క్యాల్షియం స్థాయిలు తక్కువగా ఉంటే శరీర కండరాలు సరిగా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా అనిపించడం, అలాగే ఏదైనా పని చేస్తున్నప్పుడే కాదు విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా కాళ్ళు, పాదాలు, చేతుల్లో కండరాలు తిమ్మిరిగా అనిపించవచ్చని అంటున్నారు.
ఒళ్లు జలదరింపులు:
కాలుష్యం తగ్గితే నాడీవ్యవస్థ పనితీరుపై ప్రభావం ఉంటుంది. ఫలితంగా శరీరం జలదరించడంతో పాటు వేళ్లు, కాళ్లు, పెదవులు, నాలుక వంటి భాగాల చివర సూదులతో పొడిచినట్టు అనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
గోర్లు విరిగిపోవడం:
వేలి గోళ్లు విరిగిపోవడం అనారోగ్యాన్ని సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం స్థాయిలు తగ్గడం ద్వారా తరుచుగా చేతి, కాలి గోర్లు తరుచుగా విరిగిపోతాయిని అంటున్నారు. శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే గోళ్లు పెలుసుగా మారతాయి. అంతే కాకుండా గోళ్ల చివర్లు విరిగిపోతూ, చీలిపోతూ ఉంటాయి.
దంత క్షయం‌:
క్యాల్షియం అనేది ఎనామిల్ లో ముఖ్యమైన భాగం. ఇది దంతాలపై పొరను రక్షిస్తూ ఉంటుంది. క్యాల్షియం తగినంత అందకపోతే ఎనామిల్ బలహీనపడుతుంది. ఫలితంగా దంత క్షయం వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతే కాకుండా దీని వల్ల దంతాలు త్వరగా ఊడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల నొప్పులు:
బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం క్యాల్షియం చాలా ముఖ్యమైంది. దీర్ఘకాలికంగా క్యాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
గుండె దడ:
గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే విద్యుత్ ప్రేరణలను నియంత్రించేది శక్తి క్యాల్షియంకు మాత్రమే ఉంటుంది. క్యాల్షియం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు గుండెలో అంతరాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె దడ రావడం, ఛాతీలో కాస్త నొప్పి రావడం వంటి వస్తుంటాయి.

Also Read: పసుపు ఇలా వాడతే మీ అందం రెట్టింపు అవడం పక్కా !


క్యాల్షియం కోసం ఏం తినాలి:
క్యాల్షియం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలను ప్రతి రోజు తినాలి. ముఖ్యంగా పాలు, పెరుగు, చీజ్ వంటివి తింటూ ఉండాలి. అలాగే పాలకూర వంటి ఆకుకూరలను తినాలని నిపుణులు చెబుతున్నారు. బాదం, సోయా ఉత్పత్తులు పన్నీర్ వంటివి తినాలి. అలాగే సాల్మన్ ,సార్డినెస్ చేపలను తినాలి.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×