E-Paper
Advertisement

5K Run for Peace: హైదరాబాద్‌లో 5K రన్ ఫర్ పీస్‌లో పాల్గొనండి.. ఈజీగా రూ.25,000 గెలుచుకోండి

5K Run for Peace: హైదరాబాద్‌లో 5K రన్ ఫర్ పీస్‌లో పాల్గొనండి.. ఈజీగా రూ.25,000 గెలుచుకోండి
Advertisement

5K Run for Peace: శాంతిని పెంపొందించడం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన 5K రన్ ఫర్ పీస్ ఈవెంట్ జరగనుంది. ఈ పరుగు పోటీ నవంబర్ 23, ఆదివారం రోజున నెక్లెస్ రోడ్‌లో ఉదయం 6:00 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్ ‘జాయ్ కార్నివాల్’ పేరుతో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఇది రన్నింగ్ లవర్స్ కు,  నగర వాసులకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.

ముఖ్యమైన తేదీలు, రిజిస్ట్రేషన్ వివరాలు

Advertisement

ఈ పరుగు పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ నవంబర్ 18. ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూ.300 మాత్రమే. స్కానింగ్ ద్వారా లేదా 7207827160,  7995463344 నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా నమోదు చేసుకోవచ్చు.

లాస్ట్ డేట్: నవంబర్ 18

Advertisement

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.300

బహుమతులు ఇవే

ఈ 5K పరుగులో విజేతలకు భారీ నగదు బహుమతులు ఉన్నాయి.

మొదటి బహుమతి: రూ.25,000

రెండవ బహుమతి: రూ.15,000

మూడవ బహుమతి: రూ.10,000

నగదు బహుమతులతో పాటు విజేతలకు స్థానాలు దక్కించుకున్న వారికి పతకాలు కూడా అందజేయనున్నారు. రన్నింగ్ రేస్ లో పాల్గొనేవారికి ప్రత్యేకంగా రన్నింగ్ టీ షర్ట్, ఫినిషర్ మెడల్, మెడికల్ సపోర్ట్ సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

ఈవెంట్ ఆర్గనైజర్స్‌లో బిగ్ టీవీ..

ఈ కార్యక్రమాన్ని వైబ్ ప్రైజా ఈవెంట్జ్ తో పాటు అనేక ఇతర సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో అడ్వకేట్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, ఎంట్రీ వాలా, జేకే ఫుడ్స్, బిగ్ టీవీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి సంస్థలు భాగస్వామ్యం వహించాయి. డీడీహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ఆర్కాడియా వంటి సంస్థలు కూడా సపోర్టుగా నిలిచాయి.

ఈ పరుగు పందెం పోటీ కేవలం ఒక రేసు కాదు అని ఈవెంట్ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇది సమాజంలో శాంతియుత వాతావరణం పెంపొందించడానికి స్ఫూర్తిని నింపడానికి ఉద్దేశించిన కార్నివాల్ అని తెలిపారు. ఈ వేడుకలో భాగంగా పాల్గొనేవారు అద్భుతమైన అనుభూతిని పొందుతారని నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఈ ఈవెంట్‌లో హైదరాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

నగరంలో ఆనందమైన వాతావరణం నెలకొల్పడానికి ఈవెంట్ లో పాల్గొనవచ్చు. పరుగు పందేలు క్రీడా కార్యక్రమాలు యువతను క్రీడల వైపు మళ్లిస్తాయి. నవంబర్ 23న ఉదయం నెక్లెస్ రోడ్ కొత్త ఉత్సాహంతో కళకళలాడనుంది. రిజిస్ట్రేషన్ గడువు త్వరలో ముగుస్తున్నందున అభ్యర్థులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని  నిర్వాహకులు సూచించారు.

ALSO READ: Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×