E-Paper
Advertisement

Mahesh Kumar Goud: శ్రీరాముడు బీజేపీలో సభ్యుడా? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: శ్రీరాముడు బీజేపీలో సభ్యుడా? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Mahesh Kumar Goud: నిజామాబాద్ వేదికగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోందని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచిందని, రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం సర్పంచ్ స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే ఊపుతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి ప్రజలను కష్టాల్లోకి నెట్టారని మండిపడ్డారు. గతంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ద్వారా రికార్డు స్థాయిలో 5 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించారని కొనియాడారు. రేవంత్ రెడ్డిని ఒక ‘విజనరీ లీడర్’గా అభివర్ణిస్తూ, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయికి చేరుతుందని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, సన్న బియ్యం పంపిణీలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు.

Advertisement

బీజేపీపై స్పందిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “శ్రీరాముడు ఏమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా?” అని ప్రశ్నిస్తూ, దేవుడి పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. దేవుళ్ల పేరుతో గెలిచిన బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ గత ఏడేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని, కేవలం పేర్లు మార్చడం (నిజామాబాద్‌ను ఇందూరుగా మార్చడం) వల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాదని ఎద్దేవా చేశారు.

జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసిందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బాసర, కొండగట్టు, వేములవాడ వంటి ప్రముఖ క్షేత్రాలను కలుపుతూ ‘టెంపుల్ కారిడార్’ ఏర్పాటు చేస్తామని, నిజామాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే, నిజామాబాద్-కరీంనగర్ మధ్య దూరాన్ని 26 కిలోమీటర్లు తగ్గిస్తూ 4 లైన్ల రోడ్డు నిర్మిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసిందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Advertisement

Read Also: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అంతర్జాతీయ సైబర్ ముఠా అరెస్ట్

Related News

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

Big Stories

Advertisement
×