Big Stories

Kcr Comments: కేసీఆర్‌పై సెటైర్లు, మరి తెలంగాణ మాటేంటి?

Kcr Comments: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో ఆయనకు తిరుగులేదని తెలంగాణలోని కొందరు నేతలు చెబుతారు. అదంతా పాతకాలం రోజుల మాట. కాలం మారింది.. పరిస్థితులు మారాయి.. ప్రజల ఆలోచన తీరు మారింది. తమ మాటలకు ప్రజలు ఓట్లు వేయరని నేతలకు కూడా తెలుసు.

- Advertisement -

ఇక అసలు విషయానికొద్దాం. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా షెడ్యూల్ ప్రకారం ఆ మధ్య తెగ తిరిగేశారు గులాబీ అధిపతి కేసీఆర్. మరి ఏమైందో తెలీదుగానీ ప్రచారానికి విరామం ఇచ్చినట్టు కనిపిస్తోంది. అధికారం పోయిన తర్వాత తొలిసారి రీజినల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కేసీఆర్. తెలంగాణలోని సమస్యలను వివరించారు. విద్యుత్ సెక్టార్‌పై ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. ఇదే విషయం అసెంబ్లీలో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. అసెంబ్లీలో మాట్లాడటానికి బయపడే సమావేశాలకు డుమ్మా కొట్టారన్న వ్యాఖ్యలు లేకపోలేదు.

- Advertisement -

పనిలోపనిగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రస్తావించారు. అక్కడ ఏం జరిగినా తమకు పట్టింపు లేదు, బాధలేదన్నారు కేసీఆర్. అలా చెప్పిన ఆయన చివరలో జగన్ వస్తారని మనసులోని మాట బయటపెట్టారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటూ స్నేహ భక్తిని ప్రదర్శించారు. ఆ మాట చెప్పించడానికే కేసీఆర్‌ని ఇంటర్వ్యూ చేశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కేసీఆర్- జగన్ మధ్య స్నేహం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పలుమార్లు జగన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌‌ను కలిశారు.

ALSO READ:  నేను పదవికి రాజీనామా చేస్తా.. నువ్వు కూడా రెడీనా ? : సీఎంకు హరీశ్ రావు సవాల్

మరోవైపు కేసీఆర్ కామెంట్స్‌పై సోషల్‌మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి. ఇప్పుడు చెప్పిన చిలక జోస్యం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందని ప్రశ్నిస్తున్నారు. సొంత రాష్ట్రంలో కారు ఓడిపోతున్న సమాచారం లేని కేసీఆర్‌కు, పక్క రాష్ట్రం ఫలితాలపై జోస్యం చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. పదేళ్లపాటు తెలంగాణకు అది చేశాం.. ఇది చేశామన్న కేసీఆర్, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారన్నది చెప్పనేలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News