BigTV English

SRH vs LSG IPL 2024 Preview: రెండు జట్లకి జీవన్మరణ పోరు.. నేడు హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్

SRH vs LSG IPL 2024 Preview: రెండు జట్లకి జీవన్మరణ పోరు.. నేడు హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్

SRH vs LSG Dream11 prediction IPL 2024 Match 57: ఐపీఎల్ మ్యాచ్ 2024 మ్యాచ్ లు చివరి అంకంలోకి చేరుతున్నాయి. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు అట్టడుగున ఉన్నారనేది ఒక అంచనాకి వచ్చేశారు. ఈ సమయంలో నేటి రాత్రి 7.30కి హైదరాబాద్ లో జరగనున్న సన్ రైజర్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ కి చేరాలంటే ఇక్కడ గెలవడం చాలా కీలకంగా మారింది.


ఎందుకంటే సన్ రైజర్స్, లక్నో రెండు జట్లు కూడా చెరో 12 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నాయి. అయితే రన్ రేట్ ప్రకారం హైదరాబాద్ కాస్త ముందడుగులో ఉంది. అంటే టాప్ 4 లో ఉంటే, లక్నో మాత్రం 6 వస్థానంలో ఉంది.

ఈ నేపథ్యంలో గెలిస్తే రన్ రేట్ తో సంబంధం లేకుండా ముందడుగు వేయవచ్చునని రెండు జట్లు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగాయి. మూడింటిలోనూ లక్నో గెలవడం విశేషం.


Also Read: రాజస్థాన్ కి బ్రేక్.. రేస్ లోకి ఢిల్లీ

హైదరాబాద్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ లో నలుగురు  ఆడితే మాత్రం అద్భుతాలు సృష్టిస్తోంది. లేదంటే త్వరగా వెళ్లిపోయి డగౌట్ లో కూర్చుని కావ్య పాపతో కలిసి మ్యాచ్ చూస్తున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వీరందరూ ఆడితే స్కోరు జెట్ స్పీడ్ తో పరుగులెడుతోంది. వీరిలో ముగ్గురు అయిపోయినా కథ కంచికి చేరిపోతోంది. బౌలింగు కూడా పర్వాలేదనిపించేలా వేస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో కూల్ గా ముందడుగు వేస్తోంది. పెద్ద అంచనాల్లేకుండా బాగా ఆడుతోంది. బౌలింగు, బ్యాటింగ్ అన్నింటా బాగానే ఉంది. ఓపెనర్లు డికాక్, రాహుల్ ఉన్నారు. దేవదత్ పడిక్కల్ ఒకటి ఆడితే, రెండు వదిలేస్తున్నాడు. స్టోనిస్, పూరన్ ఇంకా టచ్ లోకి రావాలి. బౌలింగు విషయానికి వస్తే కృనాల్ పాండ్యా, మయాంక్ యాదవ్, మార్కస్ స్టోనిస్, నవీన్ ఉల్ హక్ వీరందరూ ఉన్నారు.

ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే రెండు సమఉజ్జీల మధ్య పోరులో ఎవరు గెలుస్తారు? ఎవరు ప్లే అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంటారో వేచిచూడాల్సిందే.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×