BJP Vijaya Sankalpa Sabha in Jagtial: తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కు ఓటు వేయనున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కు ఓటు వేయనున్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. తెలంగాణ బీజేపీ క్రమంగా బలపడుతోంది. మల్కాజ్‌గిరి రోడ్ షోలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు’ అని అన్నారు.
“శివాజీ పార్కులో రాహుల్ గాంధీ నా పోరాటం శక్తికి వ్యతిరేకంగా అన్నారు. నాకు ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. నేను భారత మాతకు పూజారిని. శక్తిని వినాసనం చేస్తారని ఎవరైనా అంటారా.. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4వ తేదీన తెలుస్తుంది. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నాం. 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో బీఆర్ఎస్ వచ్చి చేరింది. తెలంగాణ నుంచి కుటుంబపార్టీలు ఢిల్లీలో డబ్బులు పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విచారణ ప్రారంభిస్తే మోదీని తిట్టడం ప్రారంభిస్తారు. తెలంగాణను దోచుకునే వారిని వదిలి పెట్టం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు బీఆర్ఎస్ పై ఉన్న ఆగ్రహం బయటపడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. అలాంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వికసిత్ తెలంగాణ నుంచి వికసిత్ భారత్ నా లక్ష్యం. తెలంగాణలో కేంద్రం వేల కోట్ల అభివృద్ధి పనులను చేపట్టింది” అని మోదీ అన్నారు.
Also Read: కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు.. విచారణకు రారని ప్రకటించిన ఆప్
“తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. తెలంగాణలో ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే నాకు అంత శక్తి వస్తుంది. తెలంగాణలో 2 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించాం. పసుపు ధర పెంచేలా చేశాం. రజకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ ఇది. తెలంగాణను బీఆర్ఎస్ ఏటిఎంలా వాడుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది. లిక్కర్ స్కామ్ లో కూడా కమిషన్లు తీసుకుంది” అని ప్రధాని మోదీ గత బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు.