
PM Modi Warangal tour live updates(Morning news today telugu): ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరంగల్‌కు చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్‌బేస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మామునూర్ ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయానికి చేరుకున్న మోడీకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మోడీ. గోమాత సేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌కు వెళ్లారు.
అంతకుముందు.. ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్‌లోని మామునూరుకు వచ్చారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయం.. ఆ తర్వాత కాజీపేట, అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగ సభ. ఇదీ ప్రధాని మోదీ షెడ్యూల్. పీఎం పర్యటన సందర్భంగా.. అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నగరం మొత్తం పోలీసుల కనుసన్నల్లో ఉంది.
Revanth Reddy on BRS Govt: వరదలతో భారీ నష్టం.. సర్కార్ వైఫల్యమే: రేవంత్ రెడ్డి