BigTV English

Bandi Sanjay: బండి సంజయ్ సెండాఫ్ స్పీచ్.. మోదీ సమక్షంలో ఎమోషనల్..

Bandi Sanjay: బండి సంజయ్ సెండాఫ్ స్పీచ్.. మోదీ సమక్షంలో ఎమోషనల్..
bandi sanjay speech

Bandi Sanjay speech today(Latest political news telangana): బండి సంజయ్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. తాను మాట్లాడితే.. జనం ఎలా ఉప్పొంగుతారో మళ్లీ చూపించారు. మోదీని పొగడటంలో.. కేసీఆర్‌ను తిట్టడంలో బండి సంజయ్ ఎంత ఎక్స్‌పర్టో రుజువు చేశారు. చిన్నదే అయినా.. సంచలనంగా సాగింది మోదీ సభలో సంజయ్ స్పీచ్.


సెండాఫ్ తరహాలోనే సాగింది బండి సంజయ్ ప్రసంగం. తనకు పార్టీ ఎంతో ఇచ్చిందంటూ.. బీజేపీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రెండుసార్లు కార్పొరేటర్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశంతో, ఓసారి ఎంపీని చేసిన పార్టీకి రుణపడి ఉంటానన్నారు. కమలం పువ్వు గుర్తు మీద గెలిచినందుకు గర్వంగా ఉందంటూ.. పరోక్షంగా రఘునందన్‌రావు వ్యాఖ్యలకు కౌంటర్ కూడా ఇచ్చిపడేశారు.

బాస్.. బాస్.. ప్రపంచానికే బాస్.. మోదీని కీర్తిస్తూ.. కేడర్‌లో ఫుల్ జోష్ తీసుకొచ్చారు బండి సంజయ్. మోదీ తన దోస్తే నంటూ చెప్పిన కేసీఆర్.. మరిఇప్పుడెందుకు ఈ సభకు రాలేదంటూ సెటైర్లు వేశారు. మోదీ ఏ ముఖం పెట్టుకొని వస్తారంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకూ తనదైన స్టైల్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌కు బీజేపీకి పొత్తు ఉందంటూ విషప్రచారం చేస్తున్నారని.. కారు పార్టీకే కాంగ్రెస్‌తో అసలైన పొత్తని క్లారిటీ ఇచ్చారు.


గతంలో మోదీని దగ్గరి నుంచి చూస్తే చాలని అనుకునే వాడినని.. అలాంటి మోదీ తన భుజాన్ని తట్టి.. ఆయన నోటి నుంచి బండి అని పిలిచారని.. అంతకంటే అనుభూతి తనకు ఇంకేం ఉండదని గుర్తు చేసుకున్నారు. పార్టీ జెండా మోసిన భుజం ఇదని.. బీజేపీకి శిరస్సు వంచి దండాలు పెడుతున్నానని..చెప్పారు బండి సంజయ్.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×