Big Stories

CM Jagan counter on PM Modi comments: మోదీకి కౌంటరిచ్చిన జగన్, మరో కొత్త నాటకం?

CM Jagan counter to modi comments(AP politics): రాజకీయ నేతలు అబద్దాలు మాట్లాడుతారా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఈ రోజుల్లో అబద్దాలకు అంతులేకుండా పోతోంది. దీనికి ఓ ఒక్కరూ మినహాయింపు కారు. ఇక అధికార వైసీపీ గురించి చెప్పనక్కర్లేదు. తప్పు చేసి అవతలివాళ్ల వైపు నెట్టేయడం వెన్నతో పెట్టిన విద్య అని చాలామంది ఓపెన్‌గానే చెబుతారు. తాజాగా సీఎం జగన్ కూడా అదే చేశారు.

- Advertisement -

మంగళవారం రాత్రి విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన రోడ్ షో సీఎం జగన్ పాల్గొన్నారు. ఆయన మాటలు విన్న చాలామంది నేతలే కాదు ప్రజలు కూడా షాకయ్యారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందంటే కేవలం తన వల్లేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆమోదం లేకపోవడంవల్లే స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం వెనుకడుగు వేసిందన్నారు. ఇది ముమ్మాటికీ నిజమని మనసులోని మాట బయటపెట్టుకున్నారు.

- Advertisement -

అనకాపల్లిలో ప్రధాని మాటలను ప్రస్తావిస్తూనే, గత ఎన్నికల్లో ఆయన చెప్పిన మాటలను గుర్తు చేశారు సీఎం జగన్. ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబు కంటే గొప్పవారు లేరన్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారని చెప్పారు. బీజేపీతో ఉంటే ఒకలా, వాళ్లతో లేకుంటే మరొకలా మాట్లాడుతారని అర్థమైందన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో రాజకీయాలు దిగజారాయని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతవరకు బాగానే ఉంది.

మోదీ, చంద్రబాబు, పవన్ డ్రామాలో ప్రజలకు ఏమి హామీ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు సీఎం జగన్. ప్రత్యేక హోదా ఇస్తామన్నారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఈ విషయంలో ఒక్కసారి అందరూ ఆలోచించాలన్నారు. గాజువాకలో టీడీపీకి ఓటు వేస్తే.. స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి ప్రజలు ఆమోదించినట్టేనని చెప్పుకొచ్చారు. మరి ఐదేళ్లలో విశాఖకు ఏమి చేశారో సీఎం జగన్‌బాబు చెప్పడం మరిచిపోయారన్నది ప్రత్యర్థి పార్టీల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. అంతేకాదు కొత్త నాటకానికి తెరతీశారని అంటున్నారు.

ALSO READ: డేంజర్‌లో రాష్ట్ర భవిష్యత్తు, యువత మేలుకోవాలన్న భువనేశ్వరి

సీఎం జగన్ ఎప్పుడు విశాఖ వచ్చినా, తన కాన్వాయ్‌పై పువ్వులు చల్లించుకోవడానికి మాత్రమే వస్తారన్నది కూటమి నేతల మాట. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ గెలిస్తే మంచి చేస్తారని అన్నారే తప్ప, తాము ఏమి చేస్తామనేది మాత్రం చెప్పలేదు సీఎం జగన్. తల్లి లాంటి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీపై ఓటర్లు చల్లని ఆశీస్సులు ఉండాలని కోరారు. మొత్తానికి జగన్‌బాబు చెప్పాల్సిన నిజాలు బయటపెట్టేశారు. ఇక తేల్చుకోవాల్సిందే ఓటర్లే.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News