BigTV English

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..! పోలీసుల లిస్ట్ లో నెక్స్ట్ ఉంది వీళ్లేనా?

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..! పోలీసుల లిస్ట్ లో నెక్స్ట్ ఉంది వీళ్లేనా?

Phone Tapping Case : 


⦿ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
⦿ బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులు
⦿ తిరుపతన్నతో లింక్స్ నేపథ్యంలో అనుమానాలు
⦿ వరుసగా గులాబీ నేతలకు నోటీసులు వెళ్లనున్నాయా?
⦿ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది ఇన్వాల్వ్‌మెంట్
⦿ లిస్టులో జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్?
⦿ రూరల్ బెల్ట్‌పై పోలీసుల ఫోకస్.. నెక్ట్స్ టార్గెట్ వీళ్లేనా?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదట్నుంచి సంచలన కథనాలను ప్రచురించింది స్వేచ్ఛ. ఇందులో సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరనేది పక్కా ఆధారాలతో జనం ముందు ఉంచింది. కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ కథంతా నడుస్తుండగా, అతను నగరానికి వస్తేనే కీలక స్టెప్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఈ కేసులో కీలక పరిణామాలేవీ చోటుచేసుకోలేదు. అయితే, సోమవారం ఏకంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు పంపారు పోలీసులు. తిరుపతన్నతో ఉన్న లింక్స్ నేపథ్యంలో విచారణకు రావాలని స్పష్టం చేశారు.

పోలీసుల నోటీసులు.. లింగయ్య రియాక్షన్

మాకు చాలా అనుమానాలున్నాయి, అన్నీ క్లియర్ చేయాలి, జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్‌కు రండి అంటూ లింగయ్యకు నోటీసులు పంపారు పోలీసులు. కేసులో నిందితుడైన తిరుపతన్నతో జరిగిన ఫోన్ సంభాషణల నేపథ్యంలో ఆయన్ను విచారణకు పిలిచారు. కానీ, తనకు ఆరోగ్యం బాగాలేదని, ఇప్పుడు విచారణకు రాలేనంటూ లింగయ్య పోలీసులకు తెలిపారు. ఈనెల 14న హాజరయ్యేందుకు రిక్వెస్ట్ చేశారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటిదాకా అధికారులను మాత్రమే టచ్ చేశారు పోలీసులు. ఓ రాజకీయ నేతకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది లీడర్ల పాత్ర ఉంది. అందుకే, రూరల్ ఏరియాకు సంబంధించిన లింక్స్‌పై క్లారిటీ కోసం పోలీసులు ఆ దిశగా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తోంది.

నెక్ట్స్ నోటీసులు వీళ్లకేనా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది బీఆర్ఎస్ లీడర్లకు సంబంధాలు ఉన్నాయి. కేసులో నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం సేకరించారని, దాన్ని బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వాడుకున్నారని తెలుసుకున్నారు. అందుకే ప్రణీత్ రావు ఆధారాలు దొరకకుండా హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్టుగా గుర్తించారు. తాజా నోటీసుల నేపథ్యంలో నెక్ట్స్ అందుకునేది వీళ్లేనని.. ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాలకుర్తిలో వార్ రూమ్ ఏర్పాటు చేశాడు ప్రణీత్ రావు. ఎర్రబెల్లికి పోటీగా నిలబడిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశాడు. ఒక్క పాలకుర్తిలోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ ప్రణీత్ రావు వార్ రూమ్స్ ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ నేతల మూవ్‌మెంట్స్ తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను గట్టిగా వాడేశారు.

Also Read : ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే దాడి.. ఊరికి రప్పించి మరీ దాడి చేసిన కొందరు గ్రామస్థులు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం

అప్పటి ప్రతిపక్ష నేతలు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవర్ని కలుస్తున్నారు, ఇలా సమాచారమంతా తెలుసుకుంటూ కథంతా నడిపించారు. మహబూబ్ నగర్, నల్గొండ కాంగ్రెస్ నేతల ఫోన్స్ ట్యాప్ చేసేందుకు నల్గొండలోని ఓ ఉడిపి హోటల్‌పైన పెట్టిన వార్ రూమ్‌ను ప్రభుత్వం మారాక కూడా కొనసాగించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌కు కీలక సమాచారం వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూరల్ బెల్ట్‌పై ఫోకస్ చేసిన పోలీసులు, నెక్ట్స్ ఈ ముగ్గురు మాజీ మంత్రులకే నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×