Italy Fresh Air Selling: తెలివి ఉండాలే కానీ.. ఎడారిలో ఇసుక అమ్మవచ్చు. మంచు కొండల్లో ఐస్ ను అమ్మవచ్చు. తిమ్మిని బమ్మిని చేసి జనాల నుంచి డబ్బులు దండకోవచ్చు. అచ్చంగా ఇలాంటి ప్లానే వేసింది ఓ సంస్థ. స్వచ్ఛమైన గాలిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటుంది. ఇంకీ ఆ సంస్థ ఏది? గాలిని ఎక్కడ అమ్ముతుంది? దాన్ని కొని పర్యాటకులు ఏం చేస్తున్నారంటే..
మనం అందరం సాధారణంగా టూర్లకు వెళ్తుంటాం. కొంత మంది వీలున్నప్పుడల్లా టూర్లకు ప్లాన్ చేస్తే, మరికొందరు తరచుగా వెళ్తుంటారు. కొంత మంది ఫ్యామిలీతోని ట్రిప్ కు వెళ్తే, మరికొంత మంది ఫ్రెండ్స్ తో సరదాగా షికారు వెకేషన్ కు వెళ్తుంటారు. ఎలా వెళ్లినా అందరూ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తారు. పర్యాటక ప్రాంతాలు చూస్తూ ఆనందాన్ని పొందుతారు. టూరిస్టు ప్లేస్ లోని ప్రకృతి అందాలను తిలకిస్తూ సంతోషంగా గడుపుతారు. నచ్చిన ప్లేస్ లో నిల్చొని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసుకుంటారు. ఎందుకంటే, టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఫోటోలు, వీడియోలను చూసి, మళ్లీ అక్కడే ఉన్న ఫీలింగ్ పొందుతారు.
గాలిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న కంపెనీ
టూర్ లో భాగంగా నదులు, సరస్సులు, జలపాతాల దగ్గరికి వెళ్లినప్పుడు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు. నగరాల్లో, పట్టణాల్లో ఇలాంటి గాలి దొరకదే అని నిట్టూరుస్తారు. ఫోటోల్లో టూర్ కు వెళ్లిన ప్లేస్ కనిపిస్తుంది. స్వచ్చమైన గాలిని పీల్చుకోలేరు. ఇలా ఫీలయ్యే వారి కోరిక నెరవేరుస్తోంది ఓ కంపెనీ. పర్యాటక ప్రదేశానికి వెళ్లిన టూరిస్టులకు అక్కడి స్వచ్ఛమైన గాలిని కూడా వెంట తెచ్చుకునే అవకాశం కల్పిస్తోంది. గాలిని వెంట తెచ్చుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? వినడానికి విచిత్రంగా ఉన్నా అక్షరాలా నిజం.
కమ్యూనికా సరికొత్త కొత్త ఆలోచన
ఇటలీలోని లేక్ కోమో ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులకు అక్కడి స్వచ్ఛమైన గాలిని క్యాన్లలో నింపి అందిస్తుంది కమ్యూనికా అనే కమ్యూనికేషన్ కంపెనీ. 400 మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన గాలిని రూ. 907 రూపాయలకు అమ్ముతోంది. ఆ ప్రదేశాన్ని చూసి వెనుదిరిగిన తర్వాత క్యాన్ ను ఓపెన్ చేసి అక్కడి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుగు ప్రయాణంలో లేదంటే, ఇంటికి చేరుకున్న తర్వాత లేక్ కోమోలోని ఆహ్లాదకరమైన అనుభూతిని పొందేలా చేస్తుంది. గాలి పీల్చుకున్న తర్వాత క్యాన్లను వేస్ట్ గా పడేయ కూడదని చెప్తోంది కమ్యూనికా. పర్యటనకు గుర్తుగా ఆ క్యాన్లను పెన్ స్టాండ్లుగా ఉపయోగించుకోవచ్చు అంటున్నది. సో ఇక నుంచి ఎక్కడికైనా వెళ్లినప్పుడు అక్కడి వస్తువులను మాత్రమే కాకుండా, స్వచ్ఛమైన గాలిని కూడా మన వెంట తెచ్చుకోవచ్చు. అక్కడే పర్యటిస్తున్న ఫీలింగ్ ను పొందవచ్చు. ఎంతైనా కమ్యూనికా కంపెనీ తెలివి చాలా అమోఘమైనది. ఉచితంగా దొరికే గాలిని అమ్ముతూ డబ్బులు సంపాదిస్తోంది. కంపెనీ ఆలోచనకు అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అన్నట్లూ.. ఈ గాలి క్యాన్లను పర్యాటకులు బాగానే కొంటున్నారండోయ్!
Read Also: ప్రపంచంలోని ఈ ప్రదేశాలకు పర్యాటకులు అడుగు పెట్టకూడదు, ఎందుకో తెలుసా?