Sandeep Raj: ఎట్టకేలకు కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఒక ఇంటివాడు అవ్వడానికి మొదటి అడుగు పడింది. నటి చాందినీ రావుతో అతడి నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. వైజాగ్ లో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సందీప్ రాజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇకనుంచి ఈమె నా రింగ్ మాస్టర్ అంటూ చాందినీని పరిచయం చేశాడు.
చిన్న షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సందీప్.. కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఒక చిన్న సినిమాకు అంత పెద్ద అవార్డు రావడంతో అప్పట్లో అందరి చూపు సందీప్ పైన పడింది. ఆతరువాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ మెప్పించిన ఈ కుర్ర డైరెక్టర్ ముఖ చిత్రం సినిమాకు కథను అందించాడు. ప్రస్తుతం రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మోగ్లీ సినిమాకు సందీప్ కథను అందిస్తున్నాడు.
Sudigali Sudheer: ప్రభాస్ హీరోయిన్ పై ‘గాలోడు’ కన్ను ముందే పడిందంట..
చాందినీ కూడా నటినే. సందీప్ మొదటి సినిమా కలర్ ఫోటోలో ఆమె కూడా ఒక చిన్న పాత్రలో కనిపించింది. అప్పటినుంచే వీరి ప్రేమాయణం మొదలైనట్లు తెలుస్తోంది. ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన చాందినీ.. హెడ్స్ అండ్ టేల్స్, రణస్థలి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అప్పుడప్పుడు ఆమె.. సందీప్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. బయట ఇద్దరు జంటగా కనిపించినప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని పుకార్లు మొదలయ్యాయి.
ఇక నేడు ఆ పుకార్లకు చెక్ పెడుతూ ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. డిసెంబర్ 7 న సందీప్ – చాందినీ వివాహం తిరుపతిలో జరగనుందని సమాచారం. ఇక దీంతో సినీప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.