E-Paper
Advertisement

Mla Anirudh Reddy: అందుకే నువ్వు ప్యాకేజ్ స్టార్.. పవన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

Mla Anirudh Reddy: అందుకే నువ్వు ప్యాకేజ్ స్టార్.. పవన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
Advertisement

Mla Anirudh Reddy: కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మరో 70 ఏళ్లు అయినా సీఎం కాలేరన్నారు. పవన్ తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్లిపోవాలన్నారు. అందుకే పవన్ ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చేస్తే తెలుస్తోందన్నారు. ఓజీ మూవీ ఫ్లాప్ అయినా రూ.800 పెట్టి తాను సినిమా చూశానని చెప్పుకొచ్చారు.

నేను కూడా పవన్ అభిమానినే

‘తెలంగాణ వాళ్ల నర దిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు ఎడిపోయాయని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం.. ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో. నిజంగా తెలంగాణ వాళ్లకి నర దిష్టి, ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్రా వాళ్లు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? ఇరిగేషన్, కన్‌స్ట్రక్షన్‌ అన్నింట్లో ఆంధ్రా వాళ్ళు ఉన్నారు అయినా మేము ఒక్క మాట అంటున్నామా? నేను కూడా పవన్ కల్యాణ్ అభిమానినే కానీ తప్పు మాట్లాడారు కాబట్టి తప్పే. పవన్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బతకాలని రూ.800 టికెట్ రేట్ ఉన్నా పోయి సినిమా చూశాను’- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

హైదరాబాద్ లో ఆస్తులెందుకు కొంటున్నారు?

Advertisement

తెలంగాణ వాళ్లది నర దిష్టి అయితే హైదరాబాద్‌లో ఎందుకు ఆస్తులు కొంటున్నారని పవన్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆస్తులు అమ్ముకొని పోయి విజయవాడలో ఉండాలని సూచించారు. పవన్ తప్పు మాట్లాడారు.. కాబట్టి క్షమాపణలు చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: KTR: కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

Advertisement

నవంబర్ 26న గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నాయకులు గోదావరి పచ్చదనాన్ని చూసి అసూయ పడేవారన్నారు. గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు. తెలంగాణ నాయకుల దిష్టి తగలడం వల్లే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇన్నేళ్లు ఆంధ్రా దిష్టి మా తెలంగాణకు తాకిందని కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలు తెలివితక్కువ మాటలని అని జగదీష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×