BigTV English
Advertisement

Lok Sabha Elections 2024 Highlights: ఆ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్..!

Lok Sabha Elections 2024 Highlights: ఆ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్..!

Polling has Ended in Naxal Affected Area’s: తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది.


నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలైనటువంటి ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంచిర్యాల, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.

అదేవిధంగా ఏపీలో కూడా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. పాడేరు, అరకు, రంపచోడవరంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్లలో నిలుచున్న ఓట్లరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మిగతా చోట్లా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది.


Also Read: Bihar: తొలిసారిగా ఓటు వేస్తున్నానంటూ దున్నపోతుపై వచ్చి ఓటు వేసిన యువకుడు

అయితే, ఈ నియోజకవర్గాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికలు సజావుగా జరిగేలా నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Related News

Deputy CM Bhatti: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి

Jubilee hills elections: జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills bypoll: కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు.. చలో ఏదో ఒకటి తేల్చుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Nagarkurnool: కల్వకుర్తిలో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో ఒకే కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి

CM Revanth Reddy: జూబ్లీలో మోదీ, కేసీఆర్ ఓవైపు.. రాహుల్ గాంధీ నేను ఓవైపు.. ఇక తాడోపేడో తేల్చుకుందాం: సీఎం రేవంత్

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Big Stories

×