BigTV English

Ponguleti : ఢిల్లీలో కాదు.. ఖమ్మం నడిబొడ్డులోనే.. పొంగులేటి తాజా కామెంట్స్..

Ponguleti :  ఢిల్లీలో కాదు.. ఖమ్మం నడిబొడ్డులోనే.. పొంగులేటి తాజా కామెంట్స్..

Ponguleti : బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారే అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగచాటుగా పార్టీ మారే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. పార్టీ మారాల్సి వస్తే ఖమ్మం​ నడిబొడ్డున అభిమానుల సమక్షంలో మారతానని తేల్చిచెప్పారు.


మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసంతృప్తిలో ఉన్న గులాబీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత చాలామంది నేతలు కాషాయ కండువాలు కప్పుకుంటారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ అధిష్టానంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారతానని నేరుగా చెప్పకపోయినా.. తెర వెనుక బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అమిత్ షా తో భేటీ ఖరారు కావడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఈ నెల 18న అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన బీజేపీలో చేరే తేదీపై క్లారిటీ వస్తుంది. ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరడం కన్నా ఖమ్మంలో భారీ బహిరంగ సభ వేదికగా ప్రజల సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకోవాలనే ఆలోచనలో పొంగులేటి ఉన్నారని తెలుస్తోంది. అందుకోసమే అమిత్ షా‌తో ముందుగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఈ భేటీలో తన అనుచరుల భవిష్యత్తుపైనా పొంగులేటి చర్చిస్తారని తెలుస్తోంది. పొంగులేటికి బీజేపీలో కీలక పదవి లభిస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.


పొంగులేటి వెంట నడిచేది ఎవరు?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఆయన వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావు పార్టీ మారతారని తెలుస్తోంది. తెల్లం వెంకట్రావు ప్రస్తుతం బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. అలాగే భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిథులు పొంగులేటి వెంట నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్‌కి భారీ నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెల్లం వెంకట్రావు.. భద్రాచలం నుంచి, పాయం వెంకటేశ్వర్లు ..పినపాక నుంచి, కోరం కనకయ్య ..ఇల్లందు నుంచి పోటీ చేస్తారని సమాచారం. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరితే తమ పరిస్థితేంటనే ఆందోళన స్థానిక బీజేపీ నేతలు, శ్రేణుల్లో కనిపిస్తుంది. తమ ప్రాధాన్యత తగ్గుతుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పొంగులేటి పార్టీ మారితే బీఆర్ఎస్ కు జరిగే నష్టంపై సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలతో భేటీ సందర్భంగా ఓ అంచనాకు వచ్చారు. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి పువ్వాడ అజయ్ సహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నేతలకు సూచించినట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడకుండా గులాబీ బాస్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం కొన్నిరోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ జిల్లాలో పార్టీ బలాబలాలు ఎలా మారబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×