E-Paper
Advertisement

ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!
Advertisement

housing scheme: స్వేచ్ఛ బ్యూరో: ప్రజాప్రభుత్వం పేదోళ్ల పక్షపాతిగా వ్యవహరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ..పేదల కష్టాలు తెలిసిన సర్కార్…ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. ఇది దొరల ప్రభుత్వం కాదని నొక్కి చెప్పారు. ఇక ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టి ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు.

క్యూరో పరిధిలో తొలివిడద మంజూరు

Advertisement

త్వ‌ర‌లో క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త‌గా మంజూరు చేసిన ల‌క్ష ఇళ్ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాప‌న చేయ‌డ‌మేగాక ఏడాది తిరిగిలోగా వాటి నిర్మాణాలు పూర్త‌య్యేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో నిర్మించ‌బోయే ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల స‌ముదాయానికి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స‌హ‌చ‌ర మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌ల‌తో క‌లిసి శంకుస్ధాప‌న చేశారు.

Also Read: టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Advertisement

పేదవాని గుమ్మం వద్దకే ప్రజా ప్రభుత్వం

ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన స‌భ‌లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడారు.గత బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌లే ప్ర‌జ‌లు ఒక‌చోట ఇళ్లు 30-40 కిలోమీట‌ర్ల అవ‌త‌ల ఉండేలా చేయ‌బోమ‌ని , ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఏ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇళ్లు నిర్మిస్తామ‌ని ఇది పేద‌ల‌కు పెద్ద‌న్న , ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కానుక‌గా అందిస్తామ‌ని అన్నారు.రాష్ట్రంలో పేద‌వాని గుమ్మం వ‌ద్ద‌కే ప్ర‌జా ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు చేరేలా కృషి చేస్తున్నామ‌న్నారు.

కార్పొరేట్ తరహాలో అందుబాటు

స్టాంప్స్ ,రిజిస్ట్రేష‌న్ , స‌ర్వే త‌దిత‌ర శాఖ‌లు ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ఈ స‌మీకృత భ‌వ‌నాల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. తమ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లలో భాగంగా మూడు కార్పొరేష‌న్ల‌ ప‌రిధిలోని 13 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ప్రైవేటు రంగానికి ధీటుగా కార్పొరేట్ త‌ర‌హాలో అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని చెప్పారు. అంతేగాక ప్ర‌భుత్వానిపై ఈ నిధుల భారం ప‌డ‌కుండా రియ‌ల్ ఎస్టేట్ నిర్మాణ‌రంగంలో ప్ర‌సిద్ధ‌మైన‌ సంస్ధ‌ల‌కు నిర్మించే బాధ్య‌త అప్ప‌గిస్తున్నామ‌న్నారు.

ముస్లిం సోదరుకలు గుడ్ న్యూస్

మ‌రి కొద్ది నెల‌ల్లో ఇక్క‌డ ఫినిక్స్ సంస్ధ 30వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ భ‌వ‌నాన్ని పూర్తి చేసి ఇస్తుంద‌ని వెల్ల‌డించారు. బంజారాహిల్స్ స‌మీకృత భ‌వ‌నంలో ఎస్‌.ఆర్. న‌గ‌ర్‌, బంజారాహిల్స్‌, గోల్కోండ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులు , డిఐజి కార్యాల‌యం, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ – గోల్కొండ కార్యాల‌యాలు వ‌స్తాయ‌ని వీటివ‌ల‌న ఈ ప్రాంత ప్ర‌జ‌లకు మ‌రిన్ని ఉద్యోగ‌, వ్యాపార సౌక‌ర్యాలు క‌లుగుతాయ‌న్నారు. వందలాది సంవ‌త్స‌రాలుగా ఈ ప్రాంతంలో న‌మాజ్‌చేసుకుంటున్న ముస్లిం సోద‌రుల‌కు ఏటా రెండు సార్లు న‌మాజు కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకునేలా అధికారులను ఆదేశించామ‌ని ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మానికి స్ధానిక ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా ఎంపీ సునీల్ యాద‌వ్‌, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్‌, స్టాంప్స్ ,రిజిస్ట్రేష‌న్ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాజీవ్ గాంధీ హ‌నుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read: సైబర్ సీఐ లంచం దందా.. బాధితుడిని ఎలా బెదిరించాడో తెలిస్తే షాకవుతారు!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×