BigTV English

Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌కు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. పనుల పేరుతో..సస్పెన్షన్ల పేరుతో వారిని వేధించింది నిజం కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్‌. బీఆర్‌ఎస్‌ హయాంలో 1100 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి పొన్నం.

Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..
Telangana politics

Ponnam Prabhakar Counter to KTR(Telangana politics):

సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. పనుల పేరుతో.. సస్పెన్షన్ల పేరుతో వారిని వేధించింది నిజం కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్‌. బీఆర్‌ఎస్‌ హయాంలో 1100 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి పొన్నం.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లు రాకపోవడంతో సర్పంచ్‌లు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి..అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధి పనులు చేశారు. ట్రాక్టర్‌ ఈఎంఐలు, సిబ్బంది వేతనాలు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కోసం అప్పలు చేశారు. చేసిన పనులకు, చెల్లించిన బిల్లులకు.. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు పెరిగి సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సర్పంచ్‌లు బలవన్మరణాలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించింది.

నాటి సీఎం.. నేటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ సొంత జిల్లా అయిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి సర్పంచ్​ ముంజ మంజుల.. పల్లె ప్రకృతివనం నిధులు రాక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గతంలో తీవ్ర కలకలం రేపింది. మరో వైపు నాటు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట సర్పంచ్‌ ఆనందరెడ్డి.. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వికారాబాద్‌ జిల్లా తిమ్మాయిపల్లి సర్పంచ్‌, సంగారెడ్డి జిల్లా మావినేల సర్పంచ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా రఘమాపూర్‌ సర్పంచ్‌తో పాటు పలు చోట్లు ఉపసర్పంచ్‌లు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×