E-Paper
Advertisement

Posani Krishna Murali : పోసానికి కీలక పదవి.. ఎట్టకేళకు కరుణించిన జగనన్న..

Posani Krishna Murali : పోసానికి కీలక పదవి.. ఎట్టకేళకు కరుణించిన జగనన్న..
Advertisement

Posani Krishna Murali : నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నాళ్ల నుంచో ఓ నామినేటెడ్ పోస్టు కోసం పోసాని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేళకు.. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లకు పోసానికి ఓ పోస్టు ఇచ్చారు సీఎం జగన్. ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APFDC ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోసాని కృష్ణమురళి మొదటి నుంచి వైసీపీకి, జగన్ కు వీరాభిమానిగా ఉన్నారు. పెద్ద నోరున్న నటుడు, రచయిత కావడంతో.. మీడియా సమావేశాల్లో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. చంద్రబాబును తీవ్ర స్థాయిలో తిట్టడంలో ముందుంటారు. జగన్ను బాగా వెనకేసుకొస్తుంటారు. అలాంటి పోసాని ఎప్పటి నుంచో ఏదైనా పదవి కోసం తహతహలాడుతున్నారు.

Advertisement

కమెడియన్ పృథ్వీరాజ్ లాంటి వారికి తొలినాళ్లలోనే ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమించగా.. అసభ్యకర వ్యవహారంతో ఆ పదవి పోగొట్టుకున్నారు. ఇక, ఇటీవలే నటుడు అలీకి మీడియా సలహాదారుగా అందలం ఎక్కించారు. ఇక టాలీవుడ్ నుంచి పదవి దక్కాల్సిన వ్యక్తి పోసాని మాత్రమే. ఎన్నాళ్ల నుంచో నామినేటెడ్ పోస్టు ఆయన్ను ఊరిస్తూ వస్తోంది. చివరికి ఈనాటికి ఆ సమయం వచ్చింది. APFDC ఛైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమించారు సీఎం జగన్. అయితే ఇది చాలా చిన్న పదవేనని.. పోసానికి అన్యాయం జరిగిందనే వాదనా వినిపిస్తోంది. ఇక, అసలే పోసాని నోరుకు అడ్డూఅదుపు ఉండదు.. ఇక ఆయన్ను పదవిలో కూర్చోబెడితే ఇంకేమైనా ఉందా? అంటోంది టీడీపీ.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×