CM Revanth Reddy: తెలంగాణలో చేపట్టిన కులగణన ఈ సర్వే నూటికి నూరుపాల్లు నిజమైనదని.. ప్రజలే స్వయంగా ఇచ్చిన వివరాలే ఇందులో పొందుపరిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఎవరికైనా ఇదే నా ఛాలెంజ్ అని సీఎం సవాల్ విసిరారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వేపై కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ ప్రజెంటేషన్‌కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగానే సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
చెప్పాం.. చేసి చూపించాం..
దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన సర్వే చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో దాదాపు వందేళ్ల తర్వాత ఈ ప్రక్రియను నిర్వహించామని చెప్పారు. ‘భారత్ జోడో యాత్రలో రాహుల్ కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కులగణన చేస్తామని స్పష్టం చేశారు.. చేసి చూపించాం. తెలంగాణ మోడల్ అంటే ఏంటో వివరించేందుకే ఈ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వేపై అగ్రకులాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కానీ పరిస్థితులను బట్టి మందుకు సాగాలని వారికి నచ్చజెప్పా.. మనం సంతోషంగా ఈ పని చేయాల్సిందే’ అని చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..
మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని.. లీగల్ గా ఓబీసీ అయ్యారని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఓబీసీల కోసం మోదీ మనస్ఫూర్తిగా ఏమీ చేయరు.. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే త్యాగాలు చేసింది.. కేంద్రం కులగణనకు సిద్ధం కావడం వెనుక కారణం రాహుల్ గాంధీనే.. ఆనాడు రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకురావడానికి కారణం కూడా రాహుల్ గాంధీనే.. కులగణనకు ఆర్ఎస్ఎస్ పూర్తి వ్యతిరేకం.. తెలంగాణ కోసం ఏళ్ల తరబడి పోరాటాలు చేశాం. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు’ అని సీఎం చెప్పారు.
ప్రజలు ఇచ్చిన వివరాలే పొందుపరిచాం…
‘రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కులగణన ప్రక్రియ నిర్వహించాం.. ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాం.. కాంగ్రెస్ ఉంటే అన్నీ ఉంటాయి.. కాంగ్రెస్ లేకపోతే ఏమీ ఉండవు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే త్యాగాలు చేసింది. రాష్ట్రంలో చేపట్టిన సర్వే నూటికి నూరుపాల్లు నిజమైనది.. ప్రజలే స్వయంగా ఇచ్చిన వివరాలే ఇందులో పొందుపరిచాం. ఈ విషయంలో ఎవరికైనా ఇదే నా ఛాలెంజ్’ అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
ALSO READ: Heavy Rains: ఈ రెండు మాత్రం జాగ్రత్తగా ఉండాలే.. కుండపోత వర్షం.. ఇంట్లోనే ఉండండి..
ALSO READ: NMDC LIMITED: డిగ్రీ పాసైతే చాలు భయ్యా.. రూ.2,60,000 జీతంతో ఉద్యోగాలు.. డోంట్ మిస్