BigTV English

President Draupadi Murmu: కాసేపట్లో హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లొద్దు!

President Draupadi Murmu: కాసేపట్లో హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లొద్దు!

President Draupadi Murmu visit Hyderabad: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సకాన్ని రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి తిరిగి వెళ్లే వరకు మంత్రి సీతక్క వెంటనే ఉండనున్నారు.


రాష్ట్రపతితోపాటు గౌరవ అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, నల్సార్ చాన్స్‌లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు హాజరుకానున్నట్లు యూనివర్సిటీ వీసీ కృష్ణదేవరావు తెలిపారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీసు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్ తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు.

ఇందులో భాగంగానే రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తెలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించలని పోలీసులను ఆదేశించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన ఎనిమిది స్టేట్ స్టాల్స్, నాలుగు ఫుడ్ కోర్టులు, మీడియా సెంటర్ తదితర స్టాళ్లను పరిశీలించారు.


Also Read: సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. చారిత్రాత్మక భవనాలను మహర్దశ

హైదరాబాద్ నగరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్ టీ జంక్షన్, రసూల్ పురా, సీటీఓ, ప్లాజా, టీఓలీ, కార్ఖానా, తిరుమలగిరి, లోత్ కుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనాల మళ్లింపు ఉంటుందని వెల్లడించారు.

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×