E-Paper
Advertisement

Organ Transplant: ప్రైవేట్ ఆసుపత్రులపై మంత్రి గరం గరం.. ఆ ధరలపై సీరియస్..?

Organ Transplant: ప్రైవేట్ ఆసుపత్రులపై మంత్రి గరం గరం.. ఆ ధరలపై సీరియస్..?
Advertisement

Organ Transplant: స్వేచ్చ బ్యూరో: ప్రైవేటు ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్స ధరల పై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు సైతం అవయవ మార్పిడి చికిత్స ధరలు అందుబాటులో ఉండాలని, తప్పనిసరిగా ధరల నియంత్రణ ఉండాలని మంత్రి ప్రైవేట్ యాజమాన్యాల కు సూచించారు. ఇక దాతలు ఇచ్చిన అవయవాలు వృధా కాకుండా ఆస్పత్రులు ప్రత్యేక చర్యలను చేపట్టాలన్నారు. ఇతర దేశాల నుండి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వచ్చే రోగుల కోసం నూతన విధివిధానాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్గాన్ డొనేషన్స్ యాక్ట్ సమర్థవంతంగా అమలు అయ్యేలా అవసరమైన సమగ్ర పాలసీ రూపకల్పనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి చర్చించారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్..

ప్రైవేటు ఆసుపత్రుల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్యశాఖ అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో చెయ్యి మార్పిడి చికిత్స కోసం 4 ఆసుపత్రులు అనుమతులు ఇచ్చామన్నారు. అలాగే, రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి ప్రవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారుల ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులలో సామాన్యులకు వైద్య ఖర్చులు భారం కాకుండా ఉండాలని మంత్రి సూచించారు.

Advertisement

Also Read: Panchayat Raj: గుడ్ న్యూస్.. పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్లు!

అవయవ మార్పిడి..

రాష్ట్రంలో అన్ని ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స లకు అయ్యే టారిఫ్ పై నియంత్రణ ఉండేలా కార్యాచరణ కు శ్రీకారం చుట్టామన్నారు. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలన్నారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. నరేంద్ర కుమార్, జీవన్ దాన్ డైరెక్టర్ డా. శ్రీ భూషణ్ రాజ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Fertility Centre Scam: సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్ ట్విస్ట్.. 50కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్..!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×