BigTV English

Secretariat Building : రూ.12 వందల కోట్ల ఖర్చు, రెండేళ్లు కూడా గడవని బిల్డింగ్ – అప్పుడే సెక్రటేరియట్ అంతా పగుళ్లు

Secretariat Building : రూ.12 వందల కోట్ల ఖర్చు, రెండేళ్లు కూడా గడవని బిల్డింగ్ – అప్పుడే సెక్రటేరియట్ అంతా పగుళ్లు

Secretariat Building : తెలంగాణ పరిపాలనా యంత్రాంగం మొత్తం కొలువుదీరే రాష్ట్ర సచివాలయం భవనాలు పెచ్చులూడిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సచివాలయం మూడో అంతస్తు నుంచి ఎదురు వైపున ఉండే డిజైన్ లోని ఓ భాగం ఊడిపోయింది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు సచివాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనలో సెక్రటేరియట్ పార్కింగ్ స్థలంలో ఉంచిన రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పెచ్చులు పడడంతో.. కారు పై భాగం దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. నిర్మాణం పూర్తయ్యి రెండేళ్లు కూడా పూర్తవకుండానే ఇలాంటి ఘటనలు జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దాంతో.. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ఈ ఘటన పై దర్యాప్తు ప్రారంభించారు.


దాదాపు రూ.1200 కోట్లతో నిర్మించిన భవనం. దేశంలోనే అత్యంత పేరున్న సంస్థ నిర్మించిందని ప్రచారం. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదంటూ ప్రభుత్వాలు ఊదరగొట్టేశాయి. తీరా.. రెండేళ్లు కూడా గడవక ముందే పెచ్చులూడుతూ.. నిర్మాణంలోని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో.. ప్రభుత్వ అధికారులతో పాటు పాలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తాజాగా పెచ్చులూడిన ఘటన పై సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంజనీర్లపై ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం రైలింగ్ పట్టి కూలిపోయి 24 గంటలైనా ఘటనపై అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యారు. 24 గంటల్లోగా తనకు ఈ ఘటన పై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గతంలోని బిల్డింగ్ లను పూర్తిగా నేలమట్టం చేసి 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నూతన సచివాలయం భవనాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 265 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ బిల్డింగ్ ను దేశంలోని అత్యంత ఎత్తైన సచివాలయ భవనాల్లో ఒకటిగా గుర్తించారు. 2019 జూన్ 27న అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించగా.. 2023 ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం చేశారు. ఈ బిల్డింగ్ నిర్మాణ బాధ్యతల్ని షాపూర్‌ జీ పల్లోంజీ గ్రూప్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కాగా.. దీని నిర్మాణం కోసం ఏకంగా రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. ఇంతా చేసిన తర్వాత.. రెండేళ్లు కూడా గడవక ముందే.. బిల్డింగ్ గోడలు చాలా వరకు పగుళ్లు కనిపిస్తున్నాయి. పిల్లర్ల పక్కన పొడవైన చీలికలు కనిపిస్తుండంతో.. బిల్డింగ్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. రాష్ట్ర సచివాలయ బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని బిల్డింగ్ ఇంజనీర్లకు ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.


Also Read : అక్రమాలపై హైకోర్టు వరకు పోరాటం – రూ.కోట్ల విలువైన రిసార్టులపై హైడ్రా ఉక్కుపాదం

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పాలన నిర్వహించే నిర్మాణంలో నాణ్యతా లోపాలపై నిర్మాణ సంస్థ షాపూర్ జీ పలోంజి కంపెనీ ప్రతినిధులపై మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం చేశారు. భవనం రెయిలింగ్ కూలిన విషయంలో సంస్థ తరఫున వివరణ ఇచ్చేందుకు సంస్థ ప్రతినిధులు మంత్రిని కలవగా.. కోమటి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కేంద్ర స్థానమైన భవనాన్నే ఇలా కడితే మిగతా వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఏది ఏమైనా నాణ్యతా లోపాలు ఉంటే.. సదరు సంస్థ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×