BigTV English

BIG BREAKING: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

BIG BREAKING: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

President’s Rule in Manipur: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలసిిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రపతి పాలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో 2023 నుంచి మైతేయి, కుకీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి.


అయితే, సీఎం ఓ వర్గానికే మొగ్గు చూపుతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శించారు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉండడంతో బీజేపీ హైకమాండ్ సూచనతో ఆయన తప్పుకున్నారు.

మణిపూర్ శాసన సభ సమావేశాలు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ సమావేశాల్లో బీరెన్ సింగ్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి సిద్దంగా ఉన్న సమయంలో.. బీరెన్ సింగ్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బీరెన్ సింగ్ రాజీనామా చేశారు.


రాష్ట్రపాతి పాలన ఎలా ఉంటుందంటే..

అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు.. రాష్ట్ర పాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. రాష్ట్ర పాలన రాష్ట్రపతి చేతిలోకి వెళ్తుంది. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ పనిచేస్తారు. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపాతి అడుగు జాడల్లో పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలోని చట్టాలు పార్లమెంట్ రూపొందిస్తుంది. పార్లమెంట్ సమావేశాల్లో లేకపోతే రాష్ట్రపతే ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి పాలన గరిష్టంగా 6 నెలలు పాటు విధిస్తారు. దీనిని పార్లమెంట్ అనుమతితో మూడు సంవత్సరాల వరకు పొడగించవచ్చు. దేశంలో మొదటి సారి పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించారు. 1951లో తొలిసారి పంజాబ్ లో రాష్ట్రపాతి పాలన విధించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 10 సార్లు, కేరళలో 9 సార్లు, పంజాబ్ లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఇందిరాగాంధీ కాలంలో ఆర్టికల్ 356 ను అత్యధికంగా 48 సార్లు సవరించారు.

రాష్ట్రపతి పాలన ఎప్పుడూ విధిస్తారంటే..

రాష్ట్రంలో పరిపాలను సరిగ్గా లేదని.. సంబంధిత ప్రభుత్వం విఫలమైందని గవర్నర్ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రం జారీ చేసిన పరిపాలనా పరమైన ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించినప్పుడు కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపాలన విధిస్తారు.

Also Read: Valentines Day Date: వాలెంటైన్స్ డే.. ఫస్ట్ డేట్‌లోనే మీ లవర్‌లో ‘అలా’ కలవాలి అనుకుంటున్నారా? ఇలా చేస్తే బెటర్!

అయితే.. కేంద్ర ప్రభుత్వం మణిపూర్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధించే అవకాశం ఉందని వస్తున్న వార్తల మధ్య, గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఇవాళ సీనియర్ భద్రతా అధికారులతో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. రాష్ట్రపతి పాలన అనంతరం తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చలు జరిపారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×