Ravi Babu: నటుడు చలపతిరావు గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఇక సినిమాలా కంటే ఎక్కువ వివాదాలతోనే మరింత ఫేమస్ అయ్యాడు. ఒక ఈవెంట్ లో మహిళలు పక్కలో పడుకోవడానికే పనికొస్తారు అని నోరుజారి ఇండస్ట్రీకే విరోధం అయ్యాడు. ఆ తరువాత ఆయన అనారోగ్యంతో మరణించాడు. ఇక చలపతిరావు కొడుకే నటుడు, డైరెక్టర్ రవిబాబు.
చలపతిరావు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రవిబాబును ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. తనలానే విలన్ గా కొడుకును చేయాలనుకున్నాడు. రవిబాబు కూడా ఎన్నో చిత్రాల్లో విలన్ గా కనిపించి మెప్పించాడు. నిజం చెప్పాలంటే ఆయన ఆకారం కూడా అలానే ఉంటుంది. ఆరడుగుల ఎత్తు.. బలిష్టమైన కండలు.. ముఖంలో నవ్వు ఉండదు. చూడగానే ఎవరైనా భయపడాల్సిందే. సీరియస్ గా నటనపై ఫోకస్ చేస్తే తండ్రిని మించిన గొప్ప విలన్ అయ్యేవాడు. కానీ, రవిబాబు డైరెక్షన్ వైపు మొగ్గు చూపాడు.
అల్లరి నరేష్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవిబాబునే. అల్లరి సినిమాతో నరేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది రవిబాబు. మొదటి సినిమానే మంచి విజయాన్ని అందుకొని నరేష్ ఇంటిపేరునే అల్లరిగా మార్చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత రవిబాబు చాలా మంచి హిట్స్ ఇండస్ట్రీకి అందించాడు. అమ్మాయిలు అబ్బాయిలు. అవును, అమరావతి, అనసూయ, నచ్చావులే.. ఇలా ఎన్నో సినిమాలకు ఆయన దర్శకత్వం వహించాడు.
Retro Movie: సూర్య+ బ్రేకప్ సాంగ్.. డెడ్లీ కాంబో.. టైమ్ చూసి దింపారు కదరా
ఒకపక్క డైరెక్షన్ చేస్తూనే ఇంకోపక్కా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడీ విలన్ గా నటిస్తూ వస్తున్నాడు. ఇక ఆయన సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రతి విషయాన్నీ ముక్కుసూటిగా మాట్లాడే రవిబాబు.. ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ హైట్ గురించి తక్కువ చేసి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. ఆ ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ.. ” నేను ఆరడుగులు.. అతను నా భుజం వరకు ఉంటాడు. అతనితో నేను నటించను. నాకు ఎక్కువ డబ్బు ఇస్తాను అంటే చేస్తాను అని చెప్పాను. ఆ తరువాత వాళ్లు వీళ్ళు బతిమలాడి ఆ క్యారెక్టర్ చేయించారు” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వీడియోకు పక్కన సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్, నాజర్, రవిబాబు కలిసి నటించిన సీన్ ను చూపించడంతో.. రవిబాబు మాట్లాడింది ఎన్టీఆర్ గురించే అని మిగతా హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో రవిబాబు.. ఎన్టీఆర్ ను అంత మాట అన్నాడా.. ? ఇది నిజమేనా.. ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరా తీయగా.. అది ఫేక్ అని తెల్సింది.
రవిబాబు హైట్ గురించి మాట్లాడింది వాస్తవమే కానీ, అది ఎన్టీఆర్ గురించి కాదు నటుడు అశుతోష్ రాణా గురించి అని క్లారిటీ ఇచ్చారు. వెంకీ సినిమాలో అశుతోష్ రాణా విలన్ గా చేస్తున్నాడు అని చెప్పడంతో రవిబాబు.. ” అతను విలనా.. నా భుజాల వరకు ఉంటాడు. అందులోనూ తెలుగురాదు. అతనితో కలిసి నేను నటించను. కావాలంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి.. అప్పుడు డబ్బుకోసమైన నటిస్తాను అని చెప్పాను. ఇక వాళ్లు వీళ్ళు బతిమలాడి నన్ను ఒప్పించారు” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వీడియోనే కొద్దిగా ఎడిట్ చేసి ఎన్టీఆర్ గురించి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒరిజినల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిజం ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిది అని వార్నింగ్ ఇస్తున్నారు.